Astrologer

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !
అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

3, మే 2016, మంగళవారం

చాటు పొడుపు

ఈ సీస పద్యం అచ్చమైన పొడుపు కథ.
ఇది ప్రౌఢరాయల ఆస్థాన కవి ఎవరో రచించి ఉంటారు. ఎనిమిది ప్రశ్నలు? వాటికి జవాబులు ఈ చాటువులో కవి పొందుపరచాడు.

“ రాముడెవ్వానితో రావణు మర్దించె?
పర వాసు దేవుని పట్నమేది ?
రాజమన్నారుచే రంజిల్లు శరమేది ?
వెలయ నిమ్మ పండు విత్తునేది?
అల రంభ కొప్పులో అలరు పూదండేది?
సభవారి నవ్వించు జాణ యెవడు?
సీత పెండ్లికి ఓలిచేసిన విల్లేది?
శ్రీ కృష్ణుడేయింట చెలగు చుండు?
అన్నిటను జూడ ఐదేసి యక్షరములు
ఈవ లావాల జూచిన నేక విధము  చదువు నాతడు “ భావజ్ఞ చక్ర వర్తి”  లక్షణోపేంద్ర ప్రౌఢరాయ క్షితీంద్ర !”

పై పద్యంలో మొదటి ఎనిమిది పాదాలు ప్రశ్నలు. తదుపరి రెండు పాదాలు వాటి జవాబులు తెలిపే సూచికలు.(క్లూస్)
మూడవ పాదం ఎవరైతే జవాబులు చెపుతారో వారిని “ భావజ్ఞ చక్రవర్తి” అని పిలవాలని, నాల్గవ పాదం ప్రౌఢరాయల! సంబోధన.

ఇక జవాబుల సూచికలు-
ప్రతి జవాబుకి ఐదు అక్షరాలు ఉంటాయి, ముందునుంచి వెనుక నుంచి చదివినా ఒకేలా ఉంటాయి. (ఉదా;- “ కిటికి”వలె ).
1.రాముడు ఎవరిసాహాయంతో రావణుని చంపాడు?
2.వాసుదేవుని పట్నం పేరు ఏమిటి?
3.రాజమన్నారు అనే రాజు చేతిలో బాణం ఎమిటి?(శరము=బాణము)
4. నిమ్మ పండు విత్తనం పేరు ఏది?
5.రంభ జడలో పెట్టుకొన్న పూలదండ పేరు?
6.సభలో నవ్వించే కవిపేరు ఏది?
7.సీత పెండ్లికి సుల్కంగా పెట్టిన విల్లు ఏది? ( ఓలి=శుల్కం)
8.శ్రీకృష్ణుడు ఎవరి యింట పెరిగేడు?

ఈ క్రింది జవాబులు చూడండి.
1.తోకమూకతో! ( వానరాలకి ఇంకొక పేరు.)
2.రంగనగరం! ( శ్రీరంగం )
3.లకోల కోల! ( కోల= బాణం)
4.జంబీర బీజం! ( జంబీరం=నిమ్మపండు. బీజం=విత్తనం)
5.మందార దామం! ( దామం అంటే దండ)
6.వికట కవి! ( హాస్యకవి తెనాలి రామ కృష్ణుడు)
7.పంచాస్య చాపం! ( శివుని విల్లు)
8.నంద సదనం! ( నందుని ఇల్లు)
పై జవాబులు ఐదు అక్షరాలతో, ఎటునుంచి చదివినా ఒకేలా ఉంటాయి. అదే ఈ చాటు పద్యంలోని చమత్కారం.

21, ఏప్రిల్ 2016, గురువారం

పద్యఛందస్సులు

అంగజాస్త్ర వృత్తము
గణములు - భ, మ, స, గ 1,2 పాదములకు మరియు మ, స, జ, గ-3,4 పాదములకు
యతిస్థానము - ఆఱవ అక్షరము
ఛందము - పంక్తిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 10
ప్రాసనియమము - కలదు
దానబలేంద్రోదారభమంబుల్
పూనిసగా ప్తిం బొంపిరివోవన్
జానార న్మసజంబు గస్థితం
బై నీజంజను నంగజాస్త్ర మై

అంతరాక్కర
గణములు - 1సూర్యగణము, 2ఇంద్రగణములు, 1చంద్రగణము
యతిస్థానము - నాల్గవ గణాధ్యక్షరం

ప్రాసనియమము - కలదు
కమలమిత్రుండు సురరాజగణ యుగంబు
కమలశత్రునితోఁ జెంది కందళింప
నమరుఁ బ్రావళ్ళు నర్థంబు నతిశయిల్ల
నమల మగు నంతరాక్కర మబ్ధిసంఖ్య

అంబుజ వృత్తము
ఛందము - సుప్రతిష్ఠాచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 5
గణములు - భ, వ
ఇంబగు భకా
రంబును వకా
రంబును జుమీ
యంబుజ మగున్

అంబురుహము
గణములు - భ, భ, భ, భ, ర , స, వ
యతిస్థానము - 13
ఛందము - కృతిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 20
ప్రాసనియమము - కలదు
భాభభరంబులపై సవలొందుచు భానువిశ్రమయుక్తమై
యీభువి నంబురుహంబనఁగాఁ జనునిందువంశనృపాగ్రణీ

శ్రీ రమణీప్రియ మల్లియరేచ విశిష్టకల్పమహీజ భా,
భా,ర, స, నంబుల భాను విరామమువల్కనంబురుహంబగున్.

అజిత ప్రతాపము
స్వస్థానార్థసమ వృత్తము
గణములు - స, జ, స, స, బేసి పాదములకు,న, భ, జ, భ సరిపాదములకు
పాదాక్షరసంఖ్య - 12
ప్రాసనియమము - కలదు
సజసాగణావలిఁ బ్రసన్న నభా
గ్రజరపంక్తి నభిరామరూపమై
యజితప్రతాపచెలువారుఁ గృతి
న్విజయవిక్రమణ విశ్వభూవరా

అపరాజితము
గణములు - న, న, ర, స, వ
యతిస్థానము - 9
ఛందము - శక్వరీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 14
ప్రాసనియమము - కలదు
ననరసలగముల్ దనర్చిన సత్కృతిం
దనరఁగ నపరాజితంబు కవిస్తుతిన్

అర్కుటము
గణములు - న, జ, భ, జ, జ, వ

అలసగతి

అల్పాక్కర
గణములు - 3 గణములు,2 ఇంద్రగణములు,1 చంద్రగణము
యతిస్థానము - 3వ గణాద్యక్షరము
సుమనఃపతియుగము సోముండును
నెమకంగఁ బ్రావళ్ళు నిండిమీఱ
గమనీయవిభవంబుగాంచునెప్డు
రమణీయ మల్పాక్కరము కృతుల
గమనిక - ఇది గీత పద్యము వలె నున్నది

అశ్వగతి
గణములు - భ,భ,భ,భ,భ,గ
యతిస్థానము - 10

అశ్వలలితము
గణములు - న, జ, భ, జ, భ, జ, భ, వ
యతిస్థానము - 12
ఛందము - వికృతిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 23
ప్రాసనియమము - కలదు
నజభజము ల్భజంబులకు నచ్చి భస్థలగయుక్తమై రవియతిం
బ్రజనితమైన నశ్వలలితంబు రాజకులదీప ధీజననుతా

అశ్వవిలసితము

అష్టమూర్తి
గణములు - మ, న, త, స, ర, భ, జ, య

అసంబాధ
గణములు - మ, త, న, స, గ, గ
యతిస్థానము - 12
ఛందము - శక్వరీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 14
ప్రాసనియమము - కలదు

ఆటవెలది
గణములు - బేసి పాదములలో3 సూర్యగణములు,2 ఇంద్ర గణములు, సరిపాదములలో 5సూర్యగణములు
యతిస్థానము - నాల్గవ గణాద్యక్షరం
ప్రాసయతి - చెల్లును
ప్రాస - లేదు .
ఇనగణత్రయంబు నింద్ర ద్వయంబును
హంస పంచకంబు నాటవెలది

ఆపాతలిక

ఆర్య (వృత్తము)

ఆలోల
గణములు - మ, స, మ, భ, గ, గ
యతిస్థానము - 8
ఛందము - శక్వరీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 14
ప్రాసనియమము - కలదు

ఇందువదన
గణములు - భ, జ, స, న, గ,
ఛందము - అతి జగతి
పాదాక్షర సంఖ్య - 13
యతిస్థానము - 9

ఇంద్రవంశము
గణములు - త, త, జ, ర
యతిస్థానము - 8
ఛందము - జగతీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 12
ప్రాసనియమము - కలదు
ఈ తా జ రా కల్పన నింద్రవంశకా
ఖ్యాతాఖ్య మయ్యెన్ బరగండభైరవా

సన్మానధారీ ! తతజంబు రేఫతో
విన్మింద్రవంశాహ్వయ వృత్తమై చనున్.

ఇంద్రవజ్రము
గణములు - త, త, జ, గ, గ
యతిస్థానము - 8
ఛందము - త్రిష్టుప్ఛందము
పాదాక్షరసంఖ్య - 11
ప్రాసనియమము - కలదు
ఈతాజగానిర్మితి నింద్రవజ్రా
నీతాఖ్య వర్తించు వినిర్మలోక్తిన్

ఇత్తా, జ, గా సంగతి నింద్రవజ్రా
వృత్తంబగున్ సన్నుత - వృత్తరేచా !

ఇల

ఉత్కలిక

ఉత్పలమాల
గణములు - భ, ర, న, భ, భ, ర, ల, గ
యతిస్థానము - 10
ఛందము - కృతిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 20
ప్రాసనియమము - కలదు
భానుసమాన విన్ బరన భారలగంబుల గూడి విశ్రమ
స్థానము నందు బద్మజ యుతంబుగ నుత్పలమాలయై చనున్
ప'ద్మజయుగ్యతిన్ భరనభారలగంబులఁ జెంది సన్మనః
ప'ద్మవికాస హేతువగు పద్యము నుత్పలమాలయం డ్రిలన్

ఉత్సాహము
గీ
హగణనగణంబు లేడు గుర్వంతమగుచు
వి స్తరిల్లిన నుత్సాహవృత్తమయ్యె
దీనితుద గీతియొకఁడు సంధింప విషమ
సీస మిత్తెఱఁగెఱుఁగుట చెలువుమతికి

ఓసరించుఁ బజ్జ లజ్జ లుజ్జుగించు రాజులన్
వేసరించు గర్వపర్వవేషభూషితారులన్
వాసవానుకార వీరవర్య విశ్వభూప నీ
భాసురాసిధేనుకానుభావ మాహవంబులన్

ఉత్సుకము
గణములు - భ, భ, ర
ఛందము - బృహతీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 9
ప్రాసనియమము - కలదు
ఉత్సుక మౌ భభరంబులన్
మత్సరి మాన విమర్థనా

ఉపజాతి
గణములు - ఒక పాదం త, త, జ, గ, గ (ఇంద్రవజ్రము) మరియు ఒకపాదం జ, త, త, గ, గ (ఉపేంద్రవజ్రం)
ఛందము -త్రిష్టుప్ ఛందము
యతిస్థానము - 8
ఈయింద్రవజ్రాఖ్య ముపేంద్రవజ్ర
శ్రయంబు గాఁగా నుపజాతి మయ్యెన్

ఈ రెండు వృత్తంబులు నిందుఁగూడన్
సరోజనేత్రా ! యుపజాతి యయ్యెన్.
1, 3 పాదములు ఇంద్రవజ్ర మరియు 2,4 పాదములు ఉపేంద్రవజ్ర ఉండును.

ఉపేంద్రవజ్రము
గణములు - జ, త, జ, గ, గ
యతిస్థానము - 8
ఛందము - త్రిష్టుప్ఛందము
పాదాక్షరసంఖ్య - 11
ప్రాసనియమము - కలదు
ఉపేంద్రవజ్రాహ్వయ మొప్పునిం పై
యుపేంద్రపుత్త్రా జతజోక్తగాలన్

సపద్మ పద్మా ! జత జల్గగంబున్
ఉపేంద్ర వజ్రాఖ్యము నొప్పు జెప్పన్.

ఉష్టిక్

ఊర్వశి
గణములు - న, త, త, ర, గ
యతిస్థానము - 8
ఛందము - అతిజగతీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 13
ప్రాసనియమము - కలదు

ఏకరూప

కందము
క..
కందము త్రిశర గణంబుల
నందము గా భ జ స నలము లటవడి మూటన్
బొందును నలజల నాఱిట
నొందుం దుద గురువు జగణ ముండదు బేసిన్
క.
అందును గందంబులు నా
నందంబులు భజసనలగాఖ్యలచే వా
నిం దగు నెఱుగం బ్రాసము
ముందుగ నిడి మూఁడు నైదు మూడున్నైదున్
క.
ఆదిమ వర్ణము వళి నిడు
పై దొరకినఁ గుఱుచయైన నట్టుల తత్త
త్పాదాదుల నిలుపందగు
గాదిలిగాఁ జెప్పఁ దలఁచు కందంబులన్
క.
నిడుదలగు పాదములకును
వడి నాలవగణము మొదల వలయు నిలుప న
క్కడలను గురువును మూఁడవ
యెడ నలజలలోన నొకటి నిడ బెడఁగడరున్
క.
\*ఇందు పుర బాణనగముల
కందువ జగణంబు నిలుపఁగా గా దెపుడుం
గందములకు నార్యాదుల
చందం బధికంబు వానిఁ జనుఁ దెలియంగన్

\*ఇందు=1, పుర=3, బాణ=5, నగములు=7
క.
కందము నర్థంబులతుద
నందినగురు వుడుపఁ బథ్య యగు నాఱవచోఁ
జెందిన జగణము లత్వముఁ
బొందిన నది యార్యయనఁగఁ బొసఁగుంగృతులన్
క.
క్రమమునఁ బథ్యార్యార్థము
లమరంగా వీడుపడిన నది గాథాభే
దముగాఁగం బరఁగు ప్రపం
చము తెనుఁగునఁ జెప్పరండ్రు చతురులు కృతులన్

కన్యావృత్తము
ఛందము - ప్రతిష్ఠాచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 4
ప్రాస నియమము - కలదు
పొత్తై మాగా
వృత్తిం గన్యా
వృత్తం బయ్యెన్
జిత్తం బారన్

కపాలి

కమలనగీతి

కమల విలసితము
గణములు - న, న, న, న, గ, గ
యతిస్థానము - 9
ఛందము - శక్వరీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 14
ప్రాసనియమము - కలదు

కరిబృంహితము
గణములు - భ, న, భ, న, ర
యతిస్థానము - 13
ఛందము - అతిశక్వరి ఛందము
పాదాక్షరసంఖ్య - 15
ప్రాసనియమము - కలదు

కర్ణాటచతుష్పదము

కలరవము
గణములు - స, న, న, న, ల, గ
యతిస్థానము - 8
ఛందము - శక్వరీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 14
ప్రాసనియమము - కలదు

కలహంసి
గణములు - త, య, స, భ, గ
యతిస్థానము -
ఛందము - అతిజగతీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 13
ప్రాసనియమము - కలదు

కలితాంతము
గణములు - త, ర, జ, వ
యతిస్థానము - 8
పాదమునకు 11 అక్షరాలు

కవికంఠభూషణము

కవిరాజవిరాజితము
గణములు - న, జ, జ, జ, జ, జ, జ, ల,గ
యతిస్థానము - 8,7,7 మఱియు ఇంకొక పక్షమున 8, 14
ఛందము - వికృతిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 23
ప్రాసనియమము - కలదు
క్రమమున నొక్క నకారము నాఱుజకారములున్ బరగంగ వకా
రమును నొడంబడి రా గవిరాజ విరాజిత మన్నది రామ నిభా

కిరీటము

కుటజగతి
గణములు - న, జ, మ, త, గ
యతిస్థానము -
ఛందము - అతిజగతీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 13
ప్రాసనియమము - కలదు

కుమారలలిత
గణములు - జ, న, గ
ఛందము - ఉష్ణిక్కుచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 7
ప్రాసనియమము - కలదు
కుమార లలితకున్ - సమగ్రజనగముల్

కుమారి
గణములు - న, జ, భ, జ, గ, గ
యతిస్థానము - 9
ఛందము - శక్వరీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 14
ప్రాసనియమము - కలదు

కుసుమవిచిత్రము

కుసుమితలతావేల్లి తావృత్తము
గణములు - మ, త, న, య, య, య
యతిస్థానము - 11
ఛందము - ధృతిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 18
ప్రాసనియమము - కలదు
స్వశ్రేయస్సిద్ధిన్ మతనయయయవ్యాప్తిచేఁ జర్మవాసో
విశ్రామం బొప్పగుం గుసుమితలతావేల్లితా వృత్తమయ్యెన్

కోమల వృత్తము
గణములు - న, జ, జ, య, -బేసి పాదములకు, జ, భ, స, జ,గ - సరిపాదములకు
సలలితరీతి నజాయగణంబుల్
చళుక్యభూప జభసజస్థగస్థితిన్
మలయుచు నర్థసమర్థతచేత
న్వెలుంగఁ గోమల మను వృత్త మొప్పగున్

కౌముది

క్రౌంచపదము
గణములు - భ, మ, స, భ, న, న, న, య
యతిస్థానము - 18
ఛందము - సంకృతిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 24
ప్రాసనియమము - కలదు
ప్రాంచిత తేజఃకుంచితవైరీ భమసభనననయ పరిచిత రీతిన్
అంచితమయ్యెం గ్రౌంచపదాఖ్యం బరుగతహరిదిభయతి నభివృత్తిన్

క్షమ
మారుపేరు - క్షప
గణములు - స, న, త, త, గ
ఛందము - అతిజగతీచ్ఛందము
పాదాక్షర సంఖ్య - 13
యతిస్థానము - 8
ప్రాస నియమము - కలదు

క్ష్మాహారము

ఖచరప్లుతము
గణములు - స, భ, భ, మ, స, స, వ
యతిస్థానము - 12
ఛందము - కృతిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 20
ప్రాసనియమము - కలదు
నభభముల్ మససంబు లగాప్తిన్నాగవిభూషణయుగ్యతిన్
శుభదమై ఖచరప్లుత మొప్పు న్సోమకులార్ణవచంద్రమా

గజవిలసితము

గీతాలంబనము
గణములు - త,జ,జ,న
ఛందము - త్రిష్టుప్ ఛందము
పాదాక్షరసంఖ్య -11

గోవృష
గణములు - మ, త, య, స, గ, గ
యతిస్థానము - 5
ఛందము - శక్వరీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 14
ప్రాసనియమము - కలదు

గౌరి
గణములు - న, న, న, స, గ
ఛందము - అతి జగతీ ఛందము
పాదాక్షర సంఖ్య - 13
ప్రాసనియమము - కలదు

చంచరీకాతతి
గణములు - య, మ, ర, ర, గ
యతిస్థానము - 7

చంచరీకావళి
గణములు - మ, మ, ర, ర, గ
యతిస్థానము - 7
ఛందము - అతిజగతీచ్ఛందము
పాదాక్షర సంఖ్య - 13
ప్రాస నియమము - కలదు

చంచరీకాతతి
గణములు - య, మ, ర, ర, గ
యతిస్థానము - 7
ఛందము - అతిజగతీచ్ఛందము
పాదాక్షర సంఖ్య - 13
ప్రాసనియమము - కలదు

చంద్రకళ
గణములు - ర, స, స, త, జ, జ, గ
యతిస్థానము - 11
ఛందము - అతిధృతిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 19
ప్రాసనియమము - కలదు
వ్యక్తరీతి రసాతజజగ్రాయత్త గకారనిరూఢిచే
సక్త దిగ్విరమంబన నొప్పుం జంద్రకళాహ్వయమై ధరన్

చంద్రరేఖ

చంద్రలేఖ
గణములు - న, స, ర, ర, గ
యతిస్థానము - 7
ఛందము - అతిజగతీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 13
ప్రాసనియమము - కలదు

చంద్రవర్త్మ

చంద్రశ్రీ
గణములు - య, మ, న, స, ర, గ
యతిస్థానము - 11
ఛందము - అష్టిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 16
ప్రాసనియమము - కలదు
అగుం జంద్రశ్రీదా హారవిరమణాయత్తనమైనం
బ్రగాఢంబై యొప్పున్ య మ న స ర బద్ధాగ్రగాప్తిన్

చంద్రిక
గణములు - న, న, త, ర, గ
యతిస్థానము - 8
ఛందము - అతిజగతీచ్ఛందము
పాదాక్షర సంఖ్య - 13
ప్రాస నియమము - కలదు

చంద్రిక
గణములు - న, న, ర, వ
యతిస్థానము - 7
ఛందము - త్రిష్టుప్ఛందము
పాదాక్షరసంఖ్య - 11
ప్రాసనియమము - కలదు
సలలితముగఁ జంద్రికాహ్వయం
బలరు ననరవాంక మై కృతిన్

చంపకమాల
గణములు - న, జ, భ, జ, జ, జ, ర
యతిస్థానము - 11
ఛందము - ప్రకృతిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 21
ప్రాసనియమము - కలదు
నజభజజ్జలరేఫలు పెనంగి దిశాయతి తోడ గూడినన్ 
త్రిజగదభిష్టుతా బుధనిధీ విను చంపకమాలయై చనున్

చతుష్పద

చపల

చామరము

చిత్రపదము
గణములు - భ, భ, గ, గ
ఛందము - అనుష్టుప్ఛందము
పాదాక్షరసంఖ్య - 8
ప్రాసనియమము - కలదు
చిత్రపదం బన భాగా
చిత్రయతిప్రతిపత్తిన్

చౌపది
భ స గానల ములపైని గరంబు
న్నెసఁగఁగ మూఁడవయెడ విరమంబుం
బొసఁగినఁ జౌపదిఁబొలుచు రసంబుం
గసవరముగఁ దగుఁ ప్రాసంబున్

జఘనచపల

జలంధరము
గణములు - భ, భ, భ, జ, వ
యతిస్థానము - 11
ఛందము - శక్వరీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 14
ప్రాసనియమము - కలదు

జలదము
గణములు - భ, ర, న, భ, గ
యతిస్థానము - 10
ఛందము - అతిజగతీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 13
ప్రాస నియమము - కలదు
ఈ భ ర నంబుల న్భగురు లెక్కుచు నిం
పై భజియించె నేని జలదాహ్వయ మౌ

జలధరమాల
గణములు - మ, భ, స, మ
యతిస్థానము - 9
ఛందము - జగతీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 12
ప్రాసనియమము - కలదు
మాద్యత్ప్రీతిం జలధరమాలాభిఖ్యం
బ్రద్యోతించున్ మ భ స మ భద్రాప్తిన్

జలోద్ధతగతి
గణములు - జ,స, జ,స
ఛందము - జగతీ ఛందము
పాదాక్షర సంఖ్య - 12
ప్రాసనియమము - కలదు

తనుమధ్యావృత్తము
గణములు - త, య
ఛందము - గాయత్రీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 6
ప్రాసనియమము - కలదు
ఒప్పున్ తయ యుక్తిం
జెప్పం దనుమధ్యన్

తన్వి

తరలము
మారుపేరు - ధృవకోకిల
గణములు - న, భ, ర, స, జ, జ, గ
యతిస్థానము - 12
ఛందము

7, ఏప్రిల్ 2016, గురువారం

శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం - రాశి ఫలితాలు

https://www.scribd.com/doc/307190210/Sri-Durmukhi-Nama-Samvastara-Ugadi-2016-2017-Telugu-Rasi-Phalalu-Yearly 
https://issuu.com/parakri/docs/sri_durmukhi_nama_samvastara_-_2016
https://archive.org/details/SRIDURMUKHINAMASAMVASTARA20162017TeluguRasiPhalaluYearly 
http://www.slideshare.net/parakrijaya/sri-durmukhi-nama-samvastara-20162017telugurasiphalaluyearly
తెలుగు వారంరికీ  శ్రీ దుర్ముఖి నా సంత్స శుభాకాంక్షలు
 శ్రీ దుర్ముఖి నామ సంవత్సరము ఉగాది వేడుకలు 
Sri Durmukhi Nama Samvastara Ugadi 2016-2017 Telugu Rasi Phalalu Yearly
Durmukhi nama samvatsaram -rasi phalalu 2016 to 2017 Telugu