Astrologer

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !
అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)
దేశ భక్తి గీతాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
దేశ భక్తి గీతాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, ఆగస్టు 2012, గురువారం

దేశ భక్తి గీతాలు-31-40

                                  దేశ భక్తి గీతాలు

31. జయము జయము భరతమాత
 

ఈ జగాన సాటి యెవ్వరే ఓయమ్మ నీకు       || జయము ||

గంగ యమున గోదారీ సింధు కృష్ణ కావేరీ
బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతీ నర్మద పెన్నా
పొంగి పొరలె తరంగాలు నీ మెడలో హారాలు
జీవనదుల గన్నతల్లివే ఓయమ్మ నీవు   || జయము ||

హిమ వింధ్యా పర్వతాలు దేవతలకు నిలయాలు
దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు
పసిడి పంట క్షేత్రాలు పంచలోహ ఖనిజాలు
నిజముగ నువు రత్గర్భవే ఓయమ్మ నీవు   || జయము ||

లోకమంత చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడు
నాగరికత లేక నరులు పామరులై ఉన్నప్పుడు
వేదాలను వెలికితెచ్చి జ్ఞాన భిక్ష పెట్టినావు
నిజముగ నువు జగద్గురువువే ఓయమ్మ నీవు  || జయము ||




32. తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే

 తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా
భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవన యానం చేయుదమా

సాగర మేఖల చుత్తుకొని సుర గంగ చీరగా మలచుకొని
గీతా గానం పాడుకొని మన దేవి కి ఇవ్వాలి హారతులు

గాంగ జటాధర భావనతో హిమ శైల శిఖరమే నిలబడగా
గలగల పారే నదులన్నీ ఒక బృంద గానమే చేస్తుంటే

ఎందరు వీరుల త్యాగబలం మన నేటి స్వేచ్చకే మూలబలం
వారందరిని తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని




33.నిర్మల సుర గంగాజల సంగమ క్షేత్రం

నిర్మల సుర గంగాజల సంగమ క్షేత్రం
రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం
భారతదేశం మన జన్మ ప్రదేశం
భారత ఖండం ఒక అమృత భాండం

ఉత్తరాన ఉన్నతమౌ హిమగిరి శిఖరం
దక్షిణాన నెలకొన్నది హిందు సముద్రం
తూరుపు దిశ పొంగి పొరలె గంగా సంద్రం
పశ్చిమాన అనంతమై సింధు సముద్రం  || భారతదేశం ||

ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం
రత్నగర్భ పేరు గన్న భారత దేశం
ధీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం
సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం  || భారతదేశం ||

కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం
కొండకోన వాగు పాడు సంస్కృతి గీతం
గుండె గుండె కలుసుకుంటే సమరస భావం
చేయి చేయి కలిపితేనే ప్రగతుల తీరం  || భారతదేశం ||


 34.జయ భారతా వాణీ సకల కళా రాణీ

 జయ భారతా వాణీ సకల కళా రాణీ
సంగీత వాహినీ స్వర హార ధారిణీ
అభివందనం అభివందనం

హిందువు కావేరీ హిమగిరి మకుట ధారిణీ
నవమార్గ దర్శినీ సత్యామృత వర్షిణీ
యుగయుగాల చరిత గన్న ఆనంద దాయినీ

సమతా సుహృద్భావం వెల్లివిరియు ప్రతి ఎదలో
నీ మమతా మానవతలె నిలిచిపోనీ మా మదిలో
నీ సేవయె మాకు మిన్న నవజీవన సంధాయినీ



 35.సత్యం శివం సుందరం

సాధమరి సంస్కార భారతి భారతే నవజీవనం
ప్రణవ మూలం ప్రగతి శీలం
ప్రణవ మూలం ప్రగతి శీలం ప్రఖరరాష్ట్రు వివర్థకం
శివం సత్యం సుందరం
అభినవం సంస్కరణోధ్యమం
మధుర మంజుల రాగభరితం
హృదయ తంత్రీ మంత్రితం
వాదయతి సంగీతకం
వసుదైక భావన పోషకం
లలిత రసమయ లాస్యలీల
చండ తాందవ గమక హేల
కలిత జీవిన నాట్యవేదం
కాంతి క్రాంతి కధా ప్రమోదం
చతుష్షష్టి కళాన్వితం
పరమేష్టినా పరవర్తితం
విశ్వ చక్రభమణ రూపం
శాశ్వతం శృతి సమ్మతం
జూవయత్యభి లేఖ మఖిలం
సప్తవర్ణ సమీకృతం
ప్లావయతి రససింధునా
ప్రతి హిందు మానస నందనం
 
 36.ఒకటే దేశం మనది నిజం నిజం

 ఒకటే దేశం మనది నిజం నిజం
ఒక్కటే జాతి మనది అదే నిజం అదే నిజం
వర్ణములేవైనా మరి కులములెన్ని ఉన్నా
వనంలోని చెట్లు మనం వసుదైవ  కుటుంబకం    
                                      || ఒకటే దేశం ||

భరతుడు పరిపాలించిన భారతదేశం మనది
తరతరాల వారసత్వ సంపద మనకున్నది
చేయి చాచి యాచించే అవసరమేమున్నది
అంతకన్న హీనమైన బ్రతుకింకేమున్నది
                                      || ఒకటే దేశం ||

వాల్మీకి మనవాడే వ్రాసెను రామాయణం
వ్యాసుండెవరో కాదు వ్రాసె మహాభారతం
అష్టాదశ పురాణాలు అంతులేని గ్రంథాలు
అందించిన ఋషులందరు వందనీయులే మనకు
                                      || ఒకటే దేశం ||

గుండెలలో భగవంతుని బంధించిన భక్తులు
ప్రకృతినే శాసించిన పతివ్రతా మూర్తులు
సత్యాన్వేషణకై తమ సర్వస్వాన్నర్పించిన
త్యాగులు యోగులు భళిరే వీతరాగులెందరో
                                      || ఒకటే దేశం ||


37.జన జాగృత నవ భారత మహోదయం

ఈ కనులతోనే కాంచుదాము
ఈ జీవితమున సాధించుదాం || జన ||

ప్రతి హృదిలో దేశభక్తి మోసులెత్త
నరనరాన నవచేతన వెల్లివిరియ
సమతాభావన పెంచి ప్రతి హృదిలో మమత నింపి
జాతిని సేవించుదాం మన భారతినే పూజించుదాం  || జన ||

మన పూర్వుల మహనీయుల స్మరియించి
మన సంస్కృతీ మహోన్నతిని గుర్తెరిగి
అహరహము శ్రమియించి జగతిన శిరమెత్తి నిలిచి
జాతిని సేవించుదాం మన భారతినే పూజించుదాం || జన ||

ప్రాంత భాష కులమతాల కలతలతో
పలురీతుల బలహీనత లావరించే
అందరమొకటిగా నిలచి తరతమ భేదాలు మరచి
జాతిని సేవించుదాం మన భారతినే పూజించుదాం || జన ||

నలుదిక్కుల ప్రమాదాలు పెచ్చు పెరిగి
అదనుచూచి కాటువేయ చూస్తున్నవి
జనతను జాగృత పరచి ఎదఎదలో శక్తి నింపి
జాతిని సేవించుదాం మన భారతినే పూజించుదాం || జన ||



38.భారతి నా కన్నతల్లి భాగ్యోదయ కల్పవల్లి

 భారతి నా కన్నతల్లి భాగ్యోదయ కల్పవల్లి
విశ్వ శాంతి విరియించిన చిరుపువ్వుల శిరసు మల్లి          || భారతి ||

వార్ధిత్రయ భవ్య వసన వింధ్యాచల విశద రచన
కాశ్మీరపు రశ్మి వదన నిర్మల గుణ నిఖిల సదన             || భారతి ||

సన్నుత హిమశిఖరము వలె ఉన్నత మస్తక శోభిని
పావన గంగా నది వలె జీవన గీతాదాయిని                    || భారతి ||

భారతి బంగరు ముంగిట భగవంతుడె పారాడెను
ఋషి సంతతి గొంతు విప్పి ఋక్కులు చక్కగ పాడెను     || భారతి ||

క్షమతా కేతనమెత్తెను సమతా శంఖమునొత్తెను
వితరణ గుణ గౌరవమున విశ్వమునే ముంచెత్తెను          || భారతి ||



39.మన జాతీయ జెండా

మూడు రంగుల జెండా
ముచ్చటైన జెండా
భారతీయుల జెండా
బహు గొప్ప జెండా
అందరూ మెచ్చిన జెండా
ఆకాశంలో ఎగిరే జెండా
అంధకారం పోగిట్టిన జెండా
ఆశలు మనలో రేపిన జెండా

గాంధీతాత మెచ్చిన జెండా
నెహ్రుగారికి నచ్చిన జెండా
భగత్‌సింగ్ పట్టిన జెండా
బోసు నేత ఎగరేసిన జెండా
తెల్లదొరలను ఎదిరించిన జెండా
చల్లగ స్వరాజ్యం తెచ్చిన జెండా

అందరి మదిలో నిండిన జెండా
పింగళి వెంకయ్య ఊహల జెండా
శాంతి సహనం చూపిన జెండా
అందరి నొక్కటిగా నడిపిన జెండా
మంచి మమతలు చూపిన జెండా
ఇదే నండి మన జాతీయ జెండా


40.ఈ జెండ పసిబోసి చిరునవ్వురా

ఈ జెండ పసిబోసి చిరునవ్వురా దాశ్య సంకెళ్ళు తెంచిందిరా
ఈ జెండ అమరుల తుదిశ్వాసరా రక్త తిలకాలు దిద్దిందిరా
వీర స్వతంత్ర పోరాట తొలి పిలుపురా
మనవెలలేని త్యాగాల ఘనచరితరా
తన తగుబాలతో పోరు నెర్పిందిరా
ఉరికొయ్యల్ని ఉయ్యాల చేసిందిరా
ఆ తెల్లోడి గుండెల్ని తొలిచేసినా అమ్మురా
వందేమాతరం మనదే ఈ తరం
వందేమాతరం పలికే ప్రతి నరం

చరణం 1

శాస్త్రానికి జ్ఞానానికి ఆది గురువురా మనదేశం
మానవాళికే వైతాళిక గీతం రా.. భారతం
ధర్మానికి సత్యానికి జన్మ భూమిరా మనదేశం
ఎన్నో మతాల సహజీవన సూత్రం రా.. భారతం
ఆ దైవం మనకోసం సృష్టించే ఈ స్వర్గం
శికాలలు పోసింది ఆ తల్లిరా తన దేహాన్ని తీరాన్ని పంచిందిరా
మనమేమిస్తే తీరేను ఆ రుణమురా
ఇక మనకేమి ఇచ్చిందనడగొద్దురా
భారతీయులుగ పుట్టాము ఈ జన్మకిది చాలురా...
వందేమాతరం మనదే ఈ తరం
వందేమాతరం పలికే ప్రతి నరం

చరణం 2

పిచ్చి కుక్కల ఉగ్రవాదమే రెచ్చిపోయిక కాటేసినా
వెన్ను చూపని ఉక్కు సైన్యానికే.. సలామురా
మంచు మల్లెల శాంతికపోతం నెత్తుటి తడిలో తడిసినా
చెక్కు చెదరని ఐకమత్యమే ఒక్కటే.. సవాలురా
మానవుడే మావేదం మానవతే సందేశం
మా శతకోటి హృదయాలదొకమాటరా
నువ్వు పిడికిలితో అణిచేను నీ బలుపురా
చావుకెదురైన భయపడదు మా గుండెరా
శతృవుడెవడైన తలవంచని ఈ జెండారా
ఫిరంగుల్ని ఎదిరించి తొడగొట్టి నిలిచిందిరా
వందేమాతరం మనదే ఈ తరం
వందేమాతరం పలికే ప్రతి నరం

దేశ భక్తి గీతాలు-21-30

                                          దేశ భక్తి గీతాలు

 21.వేదంలా ఘోషించే గోదావరి

 వేదంలా ఘోషించే గోదావరి
అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రి
శతాబ్దాల చరిత వి సుందర నగరం
గత వైభవ కీర్తులతో కమ్మని గానం || వేదంలా ||

1 . రాజరాజ నరేంద్రుడు కాకతీయులు
తేజమున్న మేటి దొరలు రెడ్డిరాజులు
గజపతులు నరపతులు ఏలిన ఊరు
ఆ కథలన్నీ వినిపించే గౌతమి హోరు || వేదంలా ||

శ్లోకం:
శ్రీవాణీ గిరిజాశ్చిరాయ ధధతో వక్షోముఖాంగేషు యే
లోకానాం స్థితిమావహంత్య విహతాం స్త్రీపుంస యోగోద్భవాం |
తే వేదత్రయ మూర్తయ స్త్రిపురుషా స్సంపూజితావస్సురై:
భూయాసు: పురుషోత్తమాం భుజభవ శ్రీకంధరా శ్రేయసే ||

2. ఆది కవిత నన్నయ్య వ్రాసేనిచ్చాటా
శ్రీనాథ కవి నివాసమూ పెద్ద ముచ్చటా
కవిసార్వభౌములకిది ఆలవాలమూ | కవి |
నవ కవితలు వికసించే నందనవనమూ || వేదంలా ||

3 . దిట్టమైన శిల్పాల దేవళాలు
కట్టుకథల చిత్రాంగి కనక మేడలు
కొట్టుకొని పోయె కొన్ని కోటి లింగాలు
వీరేశలింగమొకడు మిగిలెను చాలు || వేదంలా ||

 22.భరత జనని ఘన విభవము

 భరత జనని ఘన విభవము -  భూ నభముల ప్రభవించగ (2)
శుభ మంగళ జయ ఘోషల
గళము గళము కలుపుదాం - పదము పదము కదుపుదాం  (2)
రుద్ర రౌద్ర భద్ర హస్త ఢమరుక నాదమ్ముగా
శంభు శిఖా దిగ్భందిత గంగ ఝరీ భంగముగా
దక్ష యఙ్ఞ ధ్వంస భూత భద్రుని హుంకారముగా (2)
ఫణవ నాద ధ్వంకారం దశదిశలా మ్రోగగా ||గళము||

కురు రణ నిష్కర్మణాంత  ఫల్గుణ కౄత బాణముగా
జలది లంఘనోత్సాహిత హనుమ సింహ నాదముగా
ధర్మ రక్ష దీక్ష మాన్య పాంచజన్య రావముగా (2)
విజయ శంఖ స్వర నాదము వినువీధుల నినదించగ  ||గళము||

రిపు గళ శోణిత శోభిత శివ ఖడ్గ ప్రహేళిగా
రుద్ర రాణి రణ విరచిత కరవాలపు హేలగా
వన జన సమరపు ప్రేరక రామరాజ ధనువుగా  (2)
ఆనక  తంకార ధ్వనులు లోకమంత వ్యాపించగ  ||గళము||

23.స్వామీజీ వివేకుడు కలలు గన్న భారతం

స్వామీజీ వివేకుడు కలలు గన్న భారతం
గత వైభవ శిఖరాల అంచుదాక చేర్చుదాం
ఇహపరాలతో కూడిన జీవనమే మన లక్ష్యం
ఆ లక్ష్యం చేరుదాక ఆగకుండ సాగుదాం

ఇనుపకండరాలు సంఘ శక్తినినుమడించగా
ఉక్కు నరాలే ఉద్యమ స్ఫూర్తి ప్రేరకాలుగా
విలాసాల మత్తు వదిలి వివేకుని బాటనడిచి
స్వాభిమాన భారతాన్ని జగతిలోన నిలుపుదాం

దేవుడెక్కడ ఉన్నాడని నలుదిక్కుల శోధించే
దీనదళిత దు:ఖితులను దైవంగా దర్శించే
పంథాలెన్నున్నా మన గమ్యం ఒకటేనని
ప్రపంచానికందించే సందేశం ఇదేనని

ప్రతి హిందువు సోదరుడని సగర్వంగ ప్రకటించి
అన్నార్తుల అజ్ఞానుల కష్టాలను కడతీర్చే
జగతిలోన భరతమాత అధిదేవతగా నిలపి
హిందుత్వమె వసుధ లోన మార్గదర్శి కావాలని

24. మా ప్రాణాలకు నవ ప్రాణం

 మా ప్రాణాలకు నవ ప్రాణం
మా జీవాలకు నవ జీవం
మా రాష్ట్రానికి ఉజ్వల కేంద్రం
అరుణారుణ  భగవ పతాకం అరుణారుణ  భగవ పతాకం

(1) సుర సరితా కల్లోలంలో
మహనీయ ప్రణవ ఘోషలో
మా భారత కీర్తికి ఏక ప్రతీకం ||అరుణారుణ||

(2)రామ విభుని రథ కేతనమై
రావణు చంపిన పౌరుష రూపం
నరనారాయణ సమగ్ర తేజం  ||అరుణారుణ||

(3) చంద్రగుప్త చాణుక్యాదుల
శంకరవిద్యారణ్యమౌనుల
తపహ్ పూతమగు పవిత్ర చిహ్నం  ||అరుణారుణ||

మా ప్రాణాలకు నవ ప్రాణం
మా జీవాలకు నవ జీవం
మా రాష్ట్రానికి ఉజ్వల కేంద్రం
అరుణారుణ  భగవ పతాకం అరుణారుణ  భగవ పతాకం

25. ఓ జన్మభూమి భారతి

 ఓ జన్మభూమి భారతి - ఓ పుణ్యభూమి భారతి
ఓ వందనీయ భారతి  - అభినందనీయ భారతి

జీవన కుసుమమొసంగి ఆరాధింతుము జననీ
ఎన్నెన్ని జన్మలైనా నీ పూజ చేతుమమ్మా
నిన్నే స్మరింతుమమ్మా                               || ఓ జన్మభూమి||

నీ మకుట మైన హిమగిరి జగమెల్ల మెరయు చుండ
సాగరము రతనములతో అంజలి  ఘటించుచుండ
నా మాతౄభూమి ఇదియని ఎలుగెత్తి పాడుకొనుచు
నీ సేవ చేయ జననీ మా జన్మ ధన్యమమ్మా            || ఓ జన్మభూమి||

శక హూణ  మ్లేఛ్చులంతా  ఈ భూమి నాక్రమింప
నీ స్ఫూర్తి తోడ జననీ విక్రముని వంటి వీరుల్
తమ సర్వ శక్తి తోడ జాతిని సమైఖ్య పరచి
అరితతుల చండినారు నీ వీర పుత్రులమ్మా
నీ పూజ చేతుమమ్మా                                      || ఓ జన్మభూమి||

26. శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై

శ్రీలు పొంగిన జీవగడ్డై  పాలు పారిన భాగ్యసీమై
వరలినది ఈ భరత ఖండము  భక్తి పాడర తమ్ముడా !(2)

వేద శాఖలు వెలసెనిచ్చట  ఆదికావ్యం బలరె నిచ్చట |
బాదరాయణ పరమ ఋషులకు పాదు సుమ్మిది తమ్ముడా ||శ్రీలు పొంగిన||

విపిన బంధుర వృక్ష వాటిక  ఉపనిషన్మధువొలికెనిచ్చట |
విపుల తత్వము విస్తరించిన  విమల తలమిది తమ్ముడా || శ్రీలు పొంగిన||

సూత్ర యుగముల శుద్ధ వాసన క్షాత్ర యుగముల శౌర్య చండిమ
చిత్ర దాస్యము చే చరిత్రల చెరిగిపోయెర తమ్ముడా || శ్రీలు పొంగిన

మేలి కిన్నెర మేళవించీ రాలు కరుగగ రాగమెత్తి
పాలతీయని బాలభారత పథము పాడర తమ్ముడా|| (శ్రీలు పొంగిన)||

దేశగర్వము దీప్తి చెందగ దేశచరితము తేజరిల్లగ |
దేశమరసిన ధీరపురుషుల తెలిసి పాడర తమ్ముడా || (శ్రీలు పొంగిన)||

పాండవేయుల పదునుకత్తులు మండి మెరిసిన మహితరణ కధ |
కండగల చిక్కని పదంబుల కలిపి పాడర తమ్ముడా|| (శ్రీలు పొంగిన)||

27.సంఘ శాఖకు మనము రావాలోయ్

సంఘ శాఖకు మనము రావాలోయ్ -  సంఘటన  దృశ్యమ్ము చూడాలోయ్
అన్ని రంగులు కలుపు ఆత్మ చిత్రము శాఖ -  స్నేహ సంబంధాల స్వర్గధామము రా
భిన్నతలొ   ఏకతా భవ్య రూపము చూసి  -  శీల బలములు గూర్చు సిద్ధి మార్గమురా  ||సంఘ శాఖకు||
వ్యక్తి వ్యక్తిని కలుపు ముక్తి మార్గము శాఖ - భారతీయుల సౌఖ్య భావి రూపము గా
స్వార్ధమే లేనట్టి స్వచ్ఛంద పథము రా - సహృదయ భావాల సౌందర్య సీమ రా  ||సంఘ శాఖకు||
జ్ఞాన, భక్తి, కర్మ యోగ మార్గము శాఖ - వీరవ్రతము ద్యేయనిష్ఠలబ్బును రా
సంఘానుభూతికిది  సాధనాస్థలి రా - లోక కళ్యాణమే సాధనా ఫలము రా  ||సంఘ శాఖకు||

 28.మనమంతా హిందువులం

హిందువులం ప్రియ బంధువులం సుగుణ సింధు జల బిందువులం
హిందు రాష్ట్రమును పూజిద్దాం హైందవ జాతిని సేవిద్దాం
విశ్వ శాంతికై హిందు సంఘటన సోపానమ్మని చూపిద్దాం

హిందుత్వమే మన ఊపిరి హైందవమే మన సిరుల ఝరి
హిందువుగానే జీవిద్దాం హిందువుగానే మరణిద్దాం
మరల మరల ఇల జననమందుచో హిందువుగానే జన్మిద్దాం

హిందువుగా మది గర్వించు స్వాభిమానమును ఎద పెంచు
బందా రాణా గురు గోవిందుల బలిదానాలను తలపించు
ఎవరేమన్నా ఎదురేదైనా నే హిందువునని నినదించు

 చేయ్ చేయ్ కలుపుదాం సేవ చేయ కదులుదాం
ప్రజల కొరకు సంఘముగా ప్రతినిమిషం బ్రతుకుదాం

29.చేయ్ చేయ్ కలుపుదాం

చరణం1: అవయవాలు వేరైనా ఆత్మ మాత్రం ఒక్కటే
ప్రాంతం పెరేధైన ప్రజలంతా ఒక్కటే
భాషలేన్ని పలికిన భావ సంపదోక్కటే
ప్రమాదాలు ఎదురైతే ప్రతిస్పందన ఒక్కటే ||చేయ్ ||


చరణం2:కంటినలుసు కాలి ముళ్ళు కలిగిఒచే బాధలను
గుండె రగుల మెదడు కాదుల కరముల తొలగించుదాం
భారత భూమిని సీమను భాదలు పెల్లు బికినా
మన కండలు కరిగించి యిడుములు తొలగించుదాం ||చేయ్ ||

చరణం 3: జన శక్తిని జాతి కొరకు జాగ్రుత మొనరించుదాం
ఒకే తల్లి బిడ్డలమను ఊహనిచట పెంచుదాం
వందేమాతరం అంటూ ముందు ముందు కేడుదాం
ఒకకోకరి తోడూ నిలిచి ఉన్నతి సదించుదాం ||చేయ్ ||

 30.ఆంధ్ర సముద్ర మీయమ్మ పాదాలపై

కానిపింపదే నేడు కాకతీయ ప్రాజ్య
సామ్రాజ్య జాతీయ జయపతక:
వినిపింపరే నేడు విద్యానగర రాజ
సభలోని విజయ దుందుభుక మ్రోత:

వెలగదే నేడు బొబ్బిలి కోట బురుజుపై
తాండ్ర పాపయ తళత్తళల బాకు;
నిప్పచ్చరంబయ్యెనే నేడు వీర ప
ల్నాటి యోధుల సింహనాధలక్ష్మీ;

చెక్కు చెదరని, యేనాడు మొక్కవోని,
అంధ్ర పౌరుషమిప్పు డద్వాన్నమయె;
మరలనొక మాటు వెనుకకు మరలి, చూచి
దిద్దుకోవమ్మ బిడ్డల, తెలుగు తల్లి!

కవులకు బంగారు క్డియాలు తొడిగిన
రాయల గన్న వరాల కడుపు
సీసాలతో కవితాసార మిచ్చు శ్రీ
నాధుని గన్న రత్నాల కడుపు

భద్రాద్రిలో రామభద్రు స్థాపించు గో
పన్నకు గన్న పుర్వాంపు కడుపు
జగమగంటిమి నల్డెసల్ వెలార్చిన పాప
రాయని గన్న వజ్రాల కడుపు

పిసినిగొట్టు రాజులకును, పిలక జుట్టు
కుకవులకు, పిచ్చి పిచ్చి భక్తులకు, పిరికి
వందలకు తావు గాకుండ ముందు ముందు
దిద్దుకోవమ్మ బిడ్డల, తెలుగుతల్లి!

అభ్రంకషంబ్ హిమాలయం బే తల్లి
మౌళి జుట్టిన మల్లెపూల చెండు
గోదావరి కృష్ణ లేవేవి కటిసీమ
వ్రేలాడు ఆణిముత్యాల నదులు

ఆంధ్ర సముద్రమీ యమ్మ పాదాలపై
జీరాడు పట్టుకుంచ్చెల చెరంగు
ఎనుబది కోట్లు దాటిన భారతీయు లే
కళ్యాణి చల్లని కడుపు పంట

ఆమె బ్రహ్మర్షి జాతి కళ్యాణ గీతి
ధర్మాసముసేత వీరమాత ప్రవూతి
విశ్వవిఖ్యాత సిశ్రీల వెలముగాతి
పరమ కరుణ సమేత మా భరతమాత

8, ఆగస్టు 2012, బుధవారం

దేశ భక్తి గీతాలు-11-20

                                                     దేశ భక్తి గీతాలు

11. జై అందామంతా

వెలుగన్నదే రాని రాతిరుందా
ముగిసేది కాదన్న కలత ఉందా
కరి మబ్బు జల్లు పడి కరిగిపోదా
ఆశలకు అదుపంటు లేదు కదా...
జై అందామంతా ఒకటై ఇక ఇటుపై రాజ్యం మనదే
స్వాతంత్ర్యం తెచ్చే ఉదయం వచ్చే దాస్యం తుడిచి పెట్టెలే..
జై అందామంతా ఒకటై ఇక ఇటుపై రాజ్యం మనదే
స్వాతంత్ర్యం తెచ్చే ఉదయం వచ్చే దాస్యం తుడిచి పెట్టెలే...
కాలం మారిపోయే మన కథలే మారిపోయే
కష్టాలన్ని కరిగేనన్న నమ్మకం వచ్చిందోయ్
కాలం మారిపోయే మన కథలే మారిపోయే
కష్టాలన్ని కరిగేనన్న నమ్మకం వచ్చిందోయ్
జై అందామంతా ఒకటై ఇక ఇటుపై రాజ్యం మనదే
స్వాతంత్ర్యం తెచ్చే ఉదయం వచ్చే దాస్యం తుడిచి పెట్టెలే...
చేతికిలా ఇలా ఇలా ఇలా...చంద్రుడందేనులే
జుంజుం జుంజుం జుంజుం. జుం జుంజుంజుం జుంజుం
ఇంక ఇలా ఇలా ఇలా ఇలా...నవ్వు చిందేనులే
తరుణం పోనీ చూద్దాం మనదయ్యే లోకం కొద్దాం
అరె ఇంకా కొంచెం పైపైకెళితే మనదే నీలాకాశం
పంతం పోనీ చూద్దాం మనదయ్యే లోకం కొద్దాం
అరె ఇంకా కొంచెం పైపైకెళితే మనదేలే నీలాకాశం
వన్నె చిన్నెల చిలకా...వన్నె చిన్నెల చిలకా
అవకాశం వచ్చెనమ్మ వెళ్ళి అందుకో
అమ్మ అందాల చిట్టెమ్మా...అమ్మా అందాల చిట్టెమ్మా
నీ జన్మాభూమి ఒడి చేరి ఆడుకో
జై అందామంతా ఒకటై ఇక ఇటుపై రాజ్యం మనదే
స్వాతంత్ర్యం తెచ్చే ఉదయం వచ్చే దాస్యం తుడిచి పెట్టెలే...
జై అందామంతా ఒకటై ఇక ఇటుపై రాజ్యం మనదే
స్వాతంత్ర్యం తెచ్చే ఉదయం వచ్చే దాస్యం తుడిచి పెట్టెలే...
కాలం మారిపోయే మన కథలే మారిపోయే
కష్టాలన్ని కరిగేనన్న నమ్మకం వచ్చిందోయ్
కాలం మారిపోయే మన కథలే మారిపోయే
కష్టాలన్ని కరిగేనన్న నమ్మకం వచ్చిందోయ్
కష్టాలన్ని కరిగేనన్న నమ్మకం వచ్చిందోయ్
గతపంజరాల శతబంధనాలు వీడి
మోసం ద్వేషం దోషంలేని దేశం నిర్మిద్దాము
గతపంజరాల శతబంధనాలు వీడి
మోసం ద్వేషం దోషంలేని దేశం నిర్మిద్దాము
స్వేచ్ఛ దొరికే మనకు ఇక మనసుపై మంచు పొరలు ఎందుకు
స్వేచ్ఛ దొరికే మనకు ఇక మనసుపై మంచు పొరలు ఎందుకు
జై అందాం అంతా ఒకటై ఇక ఇటుపై రాజ్యం మనదే
జై అందాం అంతా ఒకటై ఇక ఇటుపై రాజ్యం మనదే
స్వాతంత్ర్యం తెచ్చే ఉదయం వచ్చే దాస్యం తుడిచి పెట్టెలే...ఏ...
అంబరంలో వాసంతం ఎటుదాక్కున్నా పిలిపిద్దాం
పిలిపిద్దాం పిలిపిద్దాం పిలిపిద్దాం పిలిపిద్దాం
మంచిని పూలుగ పూయిద్దాం మనిషిని మనిషిగ బ్రతిగిద్దాం
బ్రతిగిద్దాం బ్రతిగిద్దాం బ్రతిగిద్దాం బ్రతిగిద్దాం
అంబరంలో వాసంతం ఎటుదాక్కున్నా పిలిపిద్దాం
మంచిని పూలుగ పూయిద్దాం మనిషిని మనిషిగ బ్రతిగిద్దాం
లోకం మొత్తం కరిగిద్దాం సౌఖ్యం చిగురులు తొడిగిద్దాం
వాడా వాడా వెలిగిద్దాం వాడని వనమై వికసిద్దాం
వాడా వాడా వెలిగిద్దాం వాడని వనమై వికసిద్దాం
విశ్వాన్నేలే విజయదీతరం రెప రెపమంటూ ఎగరదాం
మేధస్వరమై వందేమాతరం బంగరు భవితను పిలవగా...

 12.ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపురా నీ జాతి నిండు గౌరవము
రాయప్రోలన్నాడు ఆనాడు అది మరిచిపోవద్దు ఏనాడు
పుట్టింది నీ మట్టిలో సీత
రూపు కట్టింది దివ్య భగద్గీత
వేదాలు వెలసిన ధరణి రా
వేదాలు వెలసిన ధరణి రా
ఓంకార నాదాలు పలికిన అవని రా
ఎన్నెన్నో దేశాలు కన్ను తెరవని నాడు
వికసించె మన నేల విఙ్ఞాన కిరణాలు
ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపురా నీ జాతి నిండు గౌరవము
వెన్నెలది ఏ మతము రా
కోకిలది ఏ కులము రా
గాలికి ఏ భాష ఉంది రా
నీతికి ఏ ప్రాంతముంది రా
గాలికీ నీటికీ లేవు భేదాలు
మనుషుల్లో ఎందుకీ తగాదాలు కులమత విభేదాలు
ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపురా నీ జాతి నిండు గౌరవము
గౌతమ బుద్ధుని బోధలు మరవద్దు
గాంధీ చూపిన మార్గం విడవద్దు
గౌతమ బుద్ధుని బోధలు మరవద్దు
గాంధీ చూపిన మార్గం విడవద్దు
దేశాల చీకట్లు తొలగించు
స్నేహ దీపాలు ఇంటింటా వెలిగించు
ఐకమత్యమే జాతికి శ్రీరామ రక్ష
అందుకే నిరంతరం సాగాలి దీక్ష...
అందుకే నిరంతరం సాగాలి దీక్ష...

13.గాంధీ పుట్టిన దేశం

గాంధీ పుట్టిన దేశం
రఘురాముడు ఏలిన రాజ్యం
ఇది సమతకు మమతకు సంకేతం
ఇది సమతకు మమతకు సంకేతం
గాంధీ పుట్టిన దేశం
రఘురాముడు ఏలిన రాజ్యం
ఇది సమతకు మమతకు సంకేతం
ఇది సమతకు మమతకు సంకేతం
రఘుపతి రాఘవ రాజారాం
పతితపావన సీతారాం
ఈశ్వర అల్లా తేరేనాం
సబకోసన్మతి దే భగవాన్
భేదాలన్నీ మరచి మోసం ద్వేషం విడచి
భేదాలన్నీ మరచి మోసం ద్వేషం విడచి
మనిషి మనిషిగా బ్రతకాలి
ఏనాడూ నీతికి నిలవాలి
మనిషి మనిషిగా బ్రతకాలి
ఏనాడూ నీతికి నిలవాలి
బాపూ ఈ కమ్మని వరమే మాకివ్వు
అవినీతిని గెలిచే బలమివ్వు
అవినీతిని గెలిచే బలమివ్వు
గాంధీ పుట్టిన దేశం
రఘురాముడు ఏలిన రాజ్యం
ఇది సమతకు మమతకు సంకేతం
ఇది సమతకు మమతకు సంకేతం
రఘుపతి రాఘవ రాజారాం
పతితపావన సీతారాం
ఈశ్వర అల్లా తేరేనాం
సబకోసన్మతి దే భగవాన్
ప్రజలకు శాంతి సౌఖ్యం కలిగించే దేశమే దేశం
ప్రజలకు శాంతి సౌఖ్యం కలిగించే దేశమే దేశం
బానిసభావం విడనాడి ఏజాతి నిలుచునో అది జాతి
బానిసభావం విడనాడి ఏజాతి నిలుచునో అది జాతి
బాపూ నీ చల్లని దీవెన మాకివ్వు
నీ బాటను నడిచే బలమివ్వు
నీ బాటను నడిచే బలమివ్వు
గాంధీ పుట్టిన దేశం
రఘురాముడు ఏలిన రాజ్యం
ఇది సమతకు మమతకు సంకేతం
ఇది సమతకు మమతకు సంకేతం
రఘుపతి రాఘవ రాజారాం
పతితపావన సీతారాం
ఈశ్వర అల్లా తేరేనాం
సబకోసన్మతి దే భగవాన్
రఘుపతి రాఘవ రాజారాం
పతితపావన సీతారాం

14. వీర భారతీయ పౌరుల్లారా..ఆ..ఆ..ఆ..

 వీర భారతీయ పౌరుల్లారా..ఆ..ఆ..ఆ..
దేశమాత పిలుపు వినలేరా..ఆ..ఆ..ఆ..
హిమాలయంలో మంటలు రేగి ప్రమాద సమయం వచ్చింది
స్వతంత్ర భారత యోధుల్లారా సవాలెదుర్కొని కదలండి
స్వతంత్ర భారత యోధుల్లారా సవాలెదుర్కొని కదలండి
సవాలెదుర్కొని కదలండి
అంతా స్నేహితులనుకున్నాము అందరి మేలు ఆశించాము
అందరి మేలు ఆశించాము
పరుల మంచికై నమ్మకముంచి పగటి కలలలో జీవించాము
నేటికి కలిగెను కనువిప్పు ముంచుకు వచ్చెను పెనుముప్పు
స్వతంత్ర భారత యోధుల్లారా సవాలెదుర్కొని కదలండి
సవాలెదుర్కొని కదలండి
వీరమాతలారా సుతులకు చంధన గంధం పూయండి
చంధన గంధం పూయండి
వీర వనితలారా పతులకు కుంకుమ తిలకం తీరచండి
కుంకుమ తిలకం తీరచండి
నెత్తురు జంకే యువకుల్లారా కత్తులు దూసి దుకండి
బానిసతనమున బ్రతికే కన్నా చావే మేలని తలచండి
స్వతంత్ర భారత యోధుల్లారా సవాలెదుర్కొని కదలండి
సవాలెదుర్కొని కదలండి
మనమంతా ఒక జాతి సమైక్యమే మన నీతి
మనమంతా ఒక జాతి సమైక్యమే మన నీతి
కులమేదైనా మతమేదైనా వేషం భాష వేరే అయినా
జనమొకటే అని చాటండి
ధర్మ దీక్షయే మన కవచం తప్పక మనదే ఘన విజయం
స్వతంత్ర భారత యోధుల్లారా సవాలెదుర్కొని కదలండి
సవాలెదుర్కొని కదలండి
భరతమాత పరువు నిల్పగా..ఆ..ఆ..ఆ..
భరతవీర ప్రతిన దాల్చరా..ఆ..ఆ..ఆ..
జయపతాక చేతబూనరా..ఆ..ఆ..ఆ..
సమర విజయ శంఖమూదరా..ఆ..ఆ..ఆ..
సమర విజయ శంఖమూదరా...

15. నీ ధర్మం నీ సంఘం నీ దేశం
 నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువు మరవద్దు
జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు
సత్యం కోసం సతినే అమ్మిన్నదెవరు - హరిశ్చంద్రుడు
తండ్రిమాటకై కానలకేగినదెవరు - శ్రీరామచంద్రుడు
అన్న సేవకే అంకితమైనదెవరన్నా - లక్ష్మన్న
పతియే దైవమని తరించింపోయినదెవరమ్మ - సీతమ్మ
ఆ పుణ్యమూర్తులు చూపినమార్గం అనుసరించుటే ధర్మం
అనుసరించుటే నీ ధర్మం
నీ ధర్మం మరవద్దు
జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు
చాపకూడుతో సమతను నేర్పెను నాటి పలనాటి బ్రహ్మన్న
మేడిపండులా మెరిసే సంగం గుట్టువిప్పెను వేమన్న
వితంతుల విధి వ్రాతలు మార్చి బ్రతుకులు పండించె కందుకూరి
తెలుగు భారతిని ప్రజలభాషలో తీరిచిదిద్దెను గురజాడ
ఆ సంస్కర్తల ఆశయరంగం నీవు నిలిచిన సంఘం
నీవు నిలిచిన ఈ సంఘం
నీ సంఘం మరవద్దు
జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు
స్వతంత్రభారత రధసారధియై సమరాన దూకె నేతాజి
సత్యాగ్రహమే సాధనమ్ముగా స్వరాజ్యమే తెచ్చె బాపూజి
గుండెకెదురుగా గుండె నిలిపెను ఆంధ్రకేసరి టంగుటూరి
తెలుగువారికొక రాష్ట్రం కోరి ఆహుతి ఆయెను అమరజీవి
ఆ దేశభక్తులు వెలసిన దేశం నీవు పుట్టిన భారతదేశం
నీవు పుట్టిన ఈ దేశం
నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువు మరవద్దు
జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు
మహనీయులనే మరవద్దు

16. దేశం మనదే తేజం మనదే

దేశం మనదే తేజం మనదే
ఎగురుతున్న జెండా మనదే
నీతి మనదే జాతి మనదే
ప్రజల అండదండా మనదే
అందాల బంధం ఉంది ఈ నేలలో
ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో
ఏ కులమైనా ఏ మతమైనా
ఏ కులమైనా ఏ మతమైనా
భరతమాతకొకటేలేరా
ఎన్ని బేధాలున్నా మాకెన్ని తేడాలున్నా
దేశమంటే ఏకమౌతాం అంతా ఈ వేళ
వందేమాతరం అంటామందరం
వందేమాతరం అంటామందరం
దేశం మనదే తేజం మనదే
ఎగురుతున్న జెండా మనదే
నీతీ మనదే జాతీ మనదే
ప్రజల అండదండా మనదే
అందాల బంధం ఉంది ఈ నేలలో
ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో
ఏ కులమైనా ఏ మతమైనా
భరతమాతకొకటేలేరా
రాజులు అయినా పేదలు అయినా
భరతమాత సుతులేలేరా
ఎన్ని దేశాలున్నా మాకెన్ని దోషాలున్నా
దేశమంటే ప్రాణమిస్తాం అంతా ఈవేళ
వందేమాతరం అంటామందరం
వందేమాతరం ఓ... అంటామందరం
వందేమాతరం వందేమాతరం
వందేమాతరం వందేమాతరం
వందేమాతరం వందేమాతరం

17.భారత మాతా భగవద్గీత

భారత మాతా భగవద్గీత
మమతా సమతా మంగళ చరిత
మధురమైన సుస్వరం
ఇది మరిచిపోదు మా తరం
అది వందేమాతరం...
వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందే
వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందే
భారత మాతా భగవద్గీత
మమతా సమతా మంగళ చరిత
మధురమైన సుస్వరం
ఇది మరిచిపోదు మా తరం
అది వందేమాతరం...
వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందే
వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందే
హిమగిరి శోభలే సిగలో మల్లెలుగా
కుంకుమ రేఖలే కాశ్మీరాలుగా
కనులకు ఆ సొగసెంతో
చాల్ చాల్లే ఈ వేషం ఆవేశం
తెలిసెను నీ లయలెన్నో
ఏం తెలిసి ఈ అలుసు నా మనసు
గృహమొక దేశమైతే మధు మధురం కాపురం
వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందే
వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందే
గంగా సంగమం యమునకు ఆగునా
జెండా వందనం జాతికి దీవెన
జనగణ మానసగీతం
గోదారై వేదాలే వల్లించే
నవరస కన్నడ రాగం
కావేరై వాగ్దేయం పాడించే
శృతిలయలే మనమైతే ఇక మనదే ఈ తరం
వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందే
వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందే
భారత మాతా భగవద్గీత
మమతా సమతా మంగళ చరిత
మధురమైన సుస్వరం
ఇది మరిచిపోదు మా తరం
అది వందేమాతరం...
వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందే
వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందే
వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందే

18.I Love India... I Love India...

I Love India... I Love India...
జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం
మమతలెరిగిన మాతౄభూమికి మంగళం మాతరం
మగువ శిరస్సున మణులు పొదిగెను హిమగిరి
కలికి పదములు కడలి కడిగిన కళ ఇది

I Love India... I Love India...
I Love India... I Love India...

గంగ యమునలు సంగమించిన గానమో
కూచిపూడికి కులుకు నేర్పిన నాట్యమో
అజంతాల... ఖజురహోల...
సంపదలతో సొంపులొలికే భారతి జయహో
మంగళం మాతరం

I Love India... I Love India...
I Love India... I Love India...

జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం
తాజమహలే ప్రణయ జీవుల పావురం
కౄష్ణవేణి శిల్పరమణి నర్తనం
వివిద జాతుల వివిద మతముల
ఎదలు మీటిన ఏక తాళపు భారతి జయహో
మంగళం మాతరం

I Love India... I Love India...
I Love India... I Love India...

జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం
మమతలెరిగిన మాతృభూమికి మంగళం మాతరం
వందే మాతరం

19.rss ప్రార్థన    
            
1. నమస్తే సదా వత్సలే మాతృభూమే
      త్వయా హిందుభూమే సుఖవ్ వర్ధితోహం
      మహామఙ్గలే పుణ్యభూమే త్వదర్థే
      పతత్వేష కాయో నమస్తే నమస్తే ||

2. ప్రభో శక్తిమన్ హిందు రాష్ట్రాఙ్గభూతా
                ఇమే సాదరన్ త్వాన్ నమామో వయం
      త్వదీయాయ కార్యాయ బధ్దా కటీయం
                శుభామాశిషన్ దేహి తత్పూర్తయే
      అజయ్యాఞచ విశ్వస్య దేహీశ శక్తిం
                సుశీలన్ జగద్  యేన నమ్రం భవేత్
      శ్రుతచైవ యత్ కణ్టకాకీర్ణ మార్గం
                స్వయం స్వీకృతం నస్ సుగ కారయేత్

3. సముత్కర్ష నిస్ శ్రేయ సస్యైక ముగ్రం
              పరం సాధనన్ నామ వీర వ్రతం
     తదంతస్ స్ఫురత్వక్షయా ధ్యేయనిష్ఠా
               హృదంతః ప్రజాగర్తు తీవ్రానిశం
     విజేత్రీ చ నస్ సంహతా కార్యశక్తిర్
               విధాయాస్య ధర్మస్య సంరక్షణం
     పరవ్ వైభవన్ నేతు మేతత్ స్వరాష్ట్రం
               సమర్థా భవత్వాశిశాతే భృశం
                                    ||భారత్ మాతా కీ జయ్||

20.హిందువులం హిందువులం

 హిందువులం హిందువులం - హిందుజాతి వారసులం
హిందు ధర్మ రక్షకులం - హిందు రాష్ట్ర సాధకులం
స్ఫూర్తి శంఖ నాదకులం ప్రణవ ఫణవ వాదకులం
ప్రియ వంశీ నాదములం ధర్మానక ధ్వానములం ||హిందువులం||
ఇంద్రధనూ వర్ణములం సింధు త్రయ వీచికలం
తీవ్ర భాను తేజములం శరత్ చంద్ర కిరణములం ||హిందువులం||
రామ ధనుర్బాణములం శివ గణముల శూలములం
చక్రి చేతి చక్రములం భరతమాత సైనికులం ||హిందువులం||
సర్వజన ప్రేమికులం భగావాధ్వజ వాహకులం
విశ్వశాంతి కాముకులం వేద ధర్మ ఘోషకులం  ||హిందువులం||

దేశ భక్తి గీతాలు-1-10

                                           దేశ భక్తి గీతాలు

1.వందేమాతరం
  వందేమాతరం
సుజలాం సుఫలాం మలయజ శీతలాం
సస్యశ్యామలాం మాతరం వందేమాతరం
శుభ్రజ్యోత్స్న పులకిత యామినీం
ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీం
సుహాసినీం సుమధుర భాషిణీం
సుఖదాం వరదాం మాతరం వందేమాతరం ||

సప్త కోటి కంఠ కలకల నివాద కరాలే
త్రిశంత్కోటి భుజై ధృత ఖర కరవాలే
అబలా కైనో మా ఐతో బోలే
బహుబల ధారిణీం నమామి తారిణీం
రిపుదల వారిణీం మాతరం వందేమాతరం ||

తుమి విద్యా తుమి ధర్మ్
తుమి హ్రుది తుమి మర్మ్ త్వాం హి ప్రాణాహ్ శరీరే ||
బాహుతే తుమి మా శక్తి
హ్రుదయే తుమి మా భక్తి
తోమారయి ప్రతిమా జడి మందిరే ||
  వందేమాతరం ||

త్వాం హి దుర్గా దశప్రహరణ ధరిణీం
కమలా కమల-దళ-విహారిణీం
వాణీ విద్యాదాయినీ నమామి త్వాం
నమామి కమలాం అమలాం అతులాం
సుజలాం సుఫలాం మాతరం
వందే మాతరం |
శ్యామలాం, సరళాం, సుస్మితాం, భూషితాం,
ధరణీం భరణీం మాతరం ||
వందే మాతరమ్. వందే మాతరమ్||


2.మా తెనుగు తల్లికి

మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా కన్న తల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కను చూపులో కరుణ
చిరునవ్వు లో సిరులు దొరలించు మా తల్లి

            గల గలా గోదారి కదలి పోతుంటేను
            బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
            బంగారు పంటలే పండుతాయి
            మురిపాల ముత్యాలు దొరలు తాయి

అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి యుండే దాక

            రుద్రమ్మ భుజ శక్తి
            మల్లమ్మ పతిభక్తి
            తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయల కీర్తి
            మా చెవుల రింగుమని మారు మ్రోగే దాక

నీ ఆటలే ఆడుతాం
నీ పాటలే పాడుతాం

జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ!

3.అంతా ఒక్కటే

 అంతా ఒక్కటే మనమంతా ఒక్కటే, ఆంధ్రులమైనా తమిళులమైనా
ఉత్కళులైనా కన్నడులైనా
మరాఠి అయినా గుజరాత్ అయినా
పంజాబ్ అయినా బంగ్లా అయినా - !!అంతా!!

వందనమండీ వందనం
వణక్కమమ్మా వణక్కం
ఎస్సలాం ఎస్సలాం
నమస్కార్ నమస్కార్

భాషలు వేర్వేరయినాగానీ
భావాలన్నీ ఒకటేనోయ్,
దేశాలన్నీ ఒకటే అయితే ద్వేషాలేమీ ఉండవుగా,
బాలప్రపంచం, భావిప్రపంచం
భావిభారత వారసులం !!అంతా!!
                                  - న్యాయపతి రాఘవరావు

 4.భారతీయ వీరులం

భారతీయ వీరులం - భరతమాత బిడ్డలం
భారతీయ వీరులం - భరతమాత బిడ్డలం
మాతృదేశ గౌరవం - కాపాడే ధీరులం
మాతృదేశ గౌరవం - కాపాడే ధీరులం
మాతృదేశ గౌరవం - కాపాడే ధీరులం
శాంతికోరు పాపలం - సమత పెంచు బాలలం
శాంతికోరు పాపలం - సమత పెంచు బాలలం
శాంతికోరు పాపలం - సమత పెంచు బాలలం
మేము భావి పౌరులం - త్యాగధనుల వారసులం
మేము భావి పౌరులం - త్యాగధనుల వారసులం
వేష భాష లేవైనా - మతాచార మేదైనా
వేష భాష లేవైనా - మతాచార మేదైనా
మనం భారతీయులం - ఒకే తల్లి పిల్లలం
మనం భారతీయులం - ఒకే తల్లి పిల్లలం
ప్రపంచాన మన దేశం - ప్రతిభను నిలబెట్టుదాం
మనమంతా సైనికులం - మనం ప్రజాసేవకులం
జాతి స్వేచ్ఛ నపహరించు - శత్రువు నెదిరించుతాం
విజయం సాధించుతాం - జయపతాక నెగరేద్దాం
విజయం సాధించుతాం - జయపతాక నెగరేద్దాం
హిమశైల కిరీటయై - సముద్ర పాదపీఠయై
గంగ, యమున, గోదావరి - కృష్ణవేణి సహితయై
విలసిల్లే భరతమాత - మన తల్లికి జోహార్
భారతీయ వీరులం - భరతమాత బిడ్డలం
భారతీయ వీరులం - భరతమాత బిడ్డలం
                                                   - దాశర
థి
                               
 5.దేశమును ప్రేమించుమన్నా
దేశమును ప్రేమించుమన్నా
      - మంచి అన్నది పెంచుమన్న 

వట్టిమాటలు కట్టిపెట్టోయ్
      - గట్టి మేల్ తలపెట్టవోయి!
పాడి పంటలు పొంగిపొర్లే
      - దారిలో నువు పాటు పడవోయి
తింది కలిగితే కండ కలదోయి
      - కండ కలవాడేను మనిషోయి
ఈసురోమని మనుషులుంటే
      - దేశ మేగతి బాగుపడునోయి
జల్దుకొని కళలెల్ల నేర్చుకు
      - దేసి సరుకులు నించవోయి
అన్ని దేశాల్ క్రమ్మవలె నోయి
      - దేశి సరుకుల నమ్మవలె నోయి
డబ్బు తేలెనట్టి నరులకు
      - కీర్తి సంపదలబ్బవోయి!
వెనుక చూసిన కార్యమేమోయి
      - మంచి గతముల కొంచమేనోయి
మందగించక ముందు అడుగేయి
      - వెనక పడితే వెనకే నోయి!
పూను స్పర్థను విద్యలందే
      - వైరములు వాణిజ్య మందే
వ్యర్ధ కలహం పెఒచబోకోయి
      - కత్తి వైరం కాల్చవోయి!
దేశాభిమానము నాకు కద్దని
      - వట్టి గొప్పలు చెప్పుకో కోయి
పూని యేదైనాను, నొక మేల్
      - కూర్చి జనులకు చూపవోయి!
ఓర్వ లేమి పిశాచి దేశం
      - మూలుగులు పీల్చేసె నోయి!
ఒరుల మేలుకు సంతసిస్తూ
      - ఐకమత్యం నేర్చవోయి!
పరుల కలిమికి పార్లి యేడ్చే
      - పాపి కెక్కడ సుఖం కద్దోయి
ఒకరి మేల్ తన మేలనెంచే
      - నేర్పరికి మేల్ కొల్ల లోయి
సొంత లాభము కొంత మానుకు
      - పొరుగువారికి తోదు పడవోయి
దేసమంటే మట్టి కాదోయి
      - దేశమంటే మనుషులోయి!
చెట్ట పట్టాల్ పట్టుకుని
      - దేశస్థు లంతా నదువవలె నోయి
అన్నదమ్ముల వలెను జాతులు
      - మతములన్నీ మెలగవలె నోయి!
మతం వేరైతేను యేమోయి
      - మనము వొకటై మనుషులుంటే
జాతి యన్నది లేచి పెరిగి
      - లోకము న రాణించునోయి!
దేశ మనియెడి దొడ్డ వృక్షం
      - ప్రేమలను పూలెత్తవలె నోయి
నరుల చమటను తడిసి మూలం
      - ధనం పంటలు పందవలె నోయి!
ఆకులందున అణిగి మణిగి
      - కవిత పలకవలె నోయి
పలుకులను విని దేసమందలి
      - మానములు మొలకెత్త వలెనోయి!

                                       -గురజాడ వెంకట అప్పారావు

 6.నారాయణ నారాయణ అల్లా అల్లా
నారాయణ నారాయణ అల్లా అల్లా
 మా పాలిట తండ్రీ నీ పిల్లల మే మెల్ల !!నారాయణ!!
మతమన్నది నాకంటికి మసకైతే
మతమన్నది నామనసుకు మబ్బైతే
మతం వద్దు గితం వద్దు మాయామర్మంవద్దు !!నారాయణ!!
ద్వేషాలు రోషాలు తెచ్చేదే మతమైతే
కలహాలు కక్షలు కలిగించేదే గతమైతే
మతం వద్దు గితం వద్దు
మారణ హోమం వద్దు !!నారాయణ!!
మతమన్నది గాంధీజీ హితమైతే
మతమన్నది లోకానికి హితమైతే
హిందువులం ముస్లిములం
అందరము మానవులం,
అందరమూ సోదరులం !!నారాయణ!!

7. పిల్లల్లారా పాపల్లారా

పిల్లల్లారా పాపల్లారా రేపటి భారతపౌరుల్లారా
పెద్దలకే ఒక దారిని చూపే పిన్నల్లారా పిల్లల్లారా
మీ కన్నుల్లో పున్నమి జాబిలి
ఉన్నాడు, ఉన్నాడు పొంచున్నాడు.

మీ మనస్సుల్లో దేవుడు కొలువై ఉన్నాడు.

ఉన్నాడు అతడున్నడు.

భారత మాతకు ముద్దులబిడ్డలు, మీరేలే మీరేలే

అమ్మకు మీపై అంతేలేని ప్రేమలే, పిల్లల్లారా ప్రేమేలే
రేపటి భారత పౌరుల్లారా...

భారత దేశం ఒకటేఇల్లు భారత మాతకు మీరే కళ్లు,

మీరే కళ్లు, మీరే కళ్లు
జాతిపతాకం పైకెగరేసి
జాతి గౌరవం కాపాడండి బడిలోబయటా అంతా కలిసి
భారతీయులై మెలగండి కన్యాకుమారికి కాశ్మీరానికి
అన్యోన్యతను పెంచండి వీడని బంధం వేయండి. పిల్లల్లారా!!
                                                           - దాశరథి

8. తల్లీభారతి

తల్లీ భారతి వందనం - తల్లీ భారతి వందనం
నీ ఇల్లే మా నందనం - మేమంతా నీ పిల్లలము
నీ చల్లని ఒదిలో మల్లెలము - తల్లిదండ్రులను గురువులను
ఎల్లవేళల కొలిచెదమమ్మా - తల్లిదండ్రులను గురువులను
ఎల్లవేళల కొలిచెదమమ్మా - చదువులు బాగా చదివెదమమ్మా
జాతి గౌరవం పెంచెదమమ్మా - చదువులు బాగా చదివెదమమ్మా
జాతి గౌరవం పెంచెదమమ్మా - కులమత భేదం మరచెదము
కలతలు మాని మెలగెదము - కులమత భేదం మరచెదము
కలతలు మాని మెలగెదము - మానవులంతా సమానులంటూ
మమతను సమతను పెంచెదము - తెలుగు జాతికీ అభ్యుదయం
నవభారతికే నవోదయం - తెలుగు జాతికీ అభ్యుదయం
నవభారతికే నవోదయం - భావిపౌరులం మనం మనం
భారత జనులకు జయం జయం - భావిపౌరులం మనం మనం

                                                                         - దాశరథి

9. వీరగంధము
వీరగంధము దెచ్చినారము
వీరుడెవ్వడో తెలుపండీ!
పూసి పోదుము మెడను వైతుము
పూలదండలు భక్తితో!!

తెలుగు బావుట కన్ను చెదరగ

కొండవీటను నెగిరినప్పుడు
తెలుగువారల కత్తిదెబ్బలు
గండికోటను కాచినప్పుడు

తెలుగువారల వేడి నెత్తురు

తుంగభద్రను గలిసినప్పుదు
దూరమందున నున్న సహ్యజ
కత్తి నెత్తురు కడిగి నప్పుడు

ఇట్టి సందియమెన్నడేనియు

బుట్టలేదు రవంతయున్;
ఇట్టి ప్రశ్నల నడుగువారలు
లేకపోయిరి సుంతయున్.

నదుముగట్టిన తెలుగు బాలుడు

వెనుక తిరుగండెన్నడున్,
బాసయుచ్చిన తెలుగు బాలుడు
పా¬ఋఇపోవం డెన్నడున్.

ఇదిగో! యున్నది వీరగంధము

మై నలందుము మైనలందుము;
శాంతిపర్వము జదువవచ్చును
శాంతి సమరంబైన పిమ్మట

తెలుగునాటిని వీరమాతను

జేసి మాత్రము తిరిగి రమ్మిక,
పలుతుపాకులు పలు ఫిరంగులు
దారి కడ్డము రాకతప్పవు

వీరగంధము దెచ్చినారము

వీరుడెవ్వడొ తెల్పుడీ!
పూసిపోదుము మెడను వైతుము
పూలదండలు భక్తితో!!

'కవిరాజు ' త్రిపురనేని రామస్వామి చౌదరి


 10.జయ జయ జయ ప్రియ భారత

 జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయ నేత్రి
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయ నేత్రి

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి
జయ జయ సశ్యామల సు శ్యామచలా చేలాంచల
జయ వసంత కుసుమలతా చరిత లలిత చూర్ణ కుంతల
జయ వసంత కుసుమలతా చరిత లలిత చూర్ణ కుంతల
జయ మదీయ హృదయాశ్రయ లాక్షారుణ పద యుగళా
జయ మదీయ హృదయాశ్రయ లాక్షారుణ పద యుగళా
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయ నేత్రి
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి
జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ
జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ
జయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణ
జయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణ
జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ
జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయ నేత్రి
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి
దివ్య ధాత్రి దివ్య ధాత్రి