Astrologer

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !
అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

20, జూన్ 2012, బుధవారం

శ్రీ శ్రీ మరికొన్నీ కవితలు






వెంపటి సత్యం
వెంపటం
అదో ఊరు కావచ్చు
ఇంటిపేరు కావచ్చు
ఐనా అదో కార్చిచ్చు
ఆపక్కనే సత్యం
అదో మనిషి పేరు కావచ్చు
అందుకే అదో వర్చస్సు
వెంపటం
కాదు సంచులు నింపటం
సొంతాస్తులు పెంచటం
వెంపటం
ఔను అన్యాయాన్ని గుండుపేల్చి చంపటం
అధర్మాన్ని గద్దెమీంచి దించడం.

    (శ్రీ శ్రీ, 1/2/73)




కూలీ ల గురించి

ఓరోరి కూలీ
ఔరా హమాలీ
పల్లెటూరు వదిలావు
పట్నానికి కదిలావు
పస్తుల్లో నలిగావు
రెండుకాళ్ళ పసువులాగ
యెండల్లో తిరిగావు
కానీలే ఇంతే నా
కరమమనీ పనికిరాని
జలమమనీ యెందుకిలా
కళ్ళుతేల వేస్తావు
కాళ్ళు జారవేస్తావు
బతికుండే చస్తావు
ఇప్లవ మేమంటున్నదో
ఇప్పుడైన తెలుసుకో
మనిసిలాగ మసలుకో
పీడించే కామందు
ఆడే ఒక రాబందు - అలాంటోడికి
సుత్తిపోటే
మత్తుదించే ఒక మందు - అప్పుడే
ఆడి మాయ సాగదు ఇకముందు

    (శ్రీ శ్రీ, 1974)



విద్యార్థుల గురించి

ఓహో ఓ విద్యార్ధీ
ఓహోహో ఓ మేధావీ
పొట్టకూడు మీకియ్యక
చట్టుబండలాయె చదువు
మేటవేసిపోయె మెదడు
భ్రష్టుపట్టిపోయె బ్రదుకు
మెదడైనా ఒడలైనా
శ్రమచేస్తేనే సంపద
కలవారల కొమ్ముకాసి
పడుచుకునే వృత్తిరోసి
కర్షక కార్మిక జన సం
ఘాతంతో కలియండి
బూర్జువాల రాజ్యాంగపు
బూజంతా దులపండి
భూతలాన స్వర్గపు ని
ర్మాతలుగా నిలవండి - ఆదిక్కుగా
మీకు దారిచూపించే
మేటితరం విరిసింది - అలాంటివాళ్ళలో
కొందరు మరణించారు
ఎందరో బతికున్నారు
అందరిదీ ఒక లక్ష్యం
ఒక గమ్యం ఒక ధేయం
అదే మనకుపాధేయం
విప్లవం వెలిగించరా!

    (శ్రీ శ్రీ, 1974)




చండ్ర పుల్లారెడ్డి
తరింఎల నాగిరెడ్డి
వేసిన పొలికేక
సత్యమూర్తి పెను ఢాక
చారుమజుందార్ పవర్
మనవేనోయ్ డియర్ బ్రదర్
కొల్లిపరా, పంచాదీ
అల్లిపురం, సిమ్మాద్రీ
చాగంటీ, కైలాసం
ఈళ్ళంతా ఈరాది
ఈరులురా సోదరా
ఈళ్ళదారి నీదిరా
ఇమక బయం నేదురా
యెర్రెర్రని రగతాల
యేరుల్లో ఈదరా
సోదరా సహోదరా
జనభారత వృకోదరా
పతితుడివో భ్రష్టుడివో
బాధాస్పర దష్టుడివో
దగాపడిన తమ్ముడివో
శ్రీశ్రీప్రియ శిష్యుడివో
చూస్తావేం నీ నిప్పులు
దాస్తావేం నీవిప్పుడు
చెయ్యి మరోప్రస్థానం
తియ్యి బృహత్ ప్రాగ్ద్వారం
విప్పు మరో అధ్యాయం
తిప్పు మహత్ కౌక్షేయం

    (శ్రీ శ్రీ, 1974)



ఎవరిది అహింస

తలకాయలు దొర్లా
లన్నాడు బిర్లా
ఔను సత్యం తలకాయ దొర్లింది
భాస్కరుడి తలకాయ దొర్లింది - ఇదే హింస

బోర్లా
పడుకున్న సంపాదకా విను
నక్సలైట్లు భేధిస్తున్నారు గాంధీ
విగ్రహాల శిరస్సులను - అదే అహింస
సత్యానికి చావు లేదు
భాస్కరుడు బతికే వుంటాడు

ఈ లోగా
పురాణాలు పుక్కిలించిన
కిరాణా కవులంతా
నక్సలైట్ నరకాసురుణ్ణెదిరించి
సినీమాతార సత్యభామ
ధనస్వామ్య దామోదరుణ్ణి రక్షిస్తుందని
అమాయకంగా నమ్ముతారు.

    (శ్రీ శ్రీ, 1971)




అంతం కాదిది ఆరంభం

భూమికోసం, భుక్తి కోసం
సాగే రైతుల పోరాటం
అనంత జీవిత సంగ్రామం


రాజులు మారీ
రోజులు మారీ
పాలన చేసే పధ్ధతిమారి-
మారనిదొకటేరా-అది
దున్నేరైతుల బతుకేరా-

సంపద పెంచే తీరులుమారి
పంపకాలలో రీతులుమారి-
మారనిదొకటేరా - అది
పేదల ఆకలి మంటేరా

తూరుపుదిక్కున వీచేగాలి
పడమటి కడలిని పిలిచేగాలి
తూరుపు పడమర లేకంచేసే
తుఫానులా చెలరేగేదాకా

భూమికోసం
భుక్తికోసం
సాగే రైతుల పోరాటం
అంతం కాదిది
ఆరంభం...........

    (శ్రీ శ్రీ, 1973)



యుద్ధ రంగం

కుళ్ళిపోయిన ప్రపంచంతో విసుగెత్తిపోయింది నీకు
కుతుబ్ మినార్ ఈ ఉదయం గోల చేస్తూ అరవబోకు
నీ వంతెనల గొంతుకలతో నీ గొర్రెల మందలతో
వేదాల పురాణాలనాటి వెర్రి కలల వందలతో

ప్రాచీన రధాల బార్లు
ఇచ్చటి మోటారు కార్లు
ఇక్కడ మతం ఒక్కటే నవీనం తత్తిమా సమస్తం దగా
మతం ఒక్కటే ౠతం, శాశ్వతం, విశాలమైన విమా
నాశ్రయంలా అమాయకం

భారతదేశంలో బుద్ధుడొకడే బతికున్నాడింకా
ఈనాటి అతి నవీన కవి ఒక్క శ్రీ శంకరా
చార్యుడే, కంచి కామాక్షి గోపుర ద్వారాలు
తెరుచుకున్నాయి పీల్చివెయ్యాలని నీ పాపాలు
నువ్వు మాత్రం ఒప్పుకోవు నీ దోషాలు
నువ్వు మాత్రం చదువుతావు గోడమీద సమాసాలు
జీవితభీమా కరపత్రాలు షేరు మార్కెట్ తమాషాలు







1 కామెంట్‌:

  1. చాలా సంతోషమండీ, శ్రీ శ్రీ రచనల సమగ్ర సంపుటాలు నా దగ్గర ఉన్నాయి. ఈ కవితలు లేవు. ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి