Astrologer

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !
అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

2, మే 2012, బుధవారం

భర్తృహరి నీతి శతకం -ఏనుగు లక్ష్మణ కవి



                              భర్తృహరి నీతి శతకం
                                                          -ఏనుగు లక్ష్మణ కవి

ఆకాశంబున నుండి శంభుని శిరం, బందుండి శీతాద్రి, సు
శ్లోకంబైన హిమాద్రి నుండి భువి, భూలోకంబునందుండి య
స్తోకాంబోధిఁ, బయోధి నుండి పవనాంథోలోకముం జేరె గం
గాకూలంకష! పెక్కు భంగులు వివేకభ్రష్ఠ సంపాతముల్! |శా|



అతనికి వార్థి కుల్య యగు, నగ్ని జలంబగు, మేరు శైలమం
చిత శిల లీలనుండు, మద సింహము జింక తెఱంగుఁ దాల్చు, గో
పిత ఫణి పూలదండయగు, భిష్మవిషంబు సుధారసంబగున్,
క్షితి జన సమ్మతంబగు సుశీల మదెవ్వని యందు శోభిలున్ |చ|



ఆపదలందు ధైర్య గుణ, మంచిత సంపదలందుఁ దాల్మియున్,
భూప సభంతరాళమునఁ బుష్కల వాక్చతురత్వ, మాజి బా
హా పటు శక్తియున్, Yఅశమునం దనురక్తియు, విద్య యందు వాం
ఛా పరివృద్ధియున్, బ్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాళికిన్ |ఉ|



ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై
యారంభించి పరిత్యజింతురురు విఘ్నాయత్తులై మధ్యముల్
ధీరుల్ విఘ్ననిహన్య మానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై
ప్రారబ్ధార్థము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్ |శా|



ఒకచో నేలను బవ్వళించు, నొకచో నొప్పారుఁ బూసెజ్జపై,
నొకచోశాకము లారగించు, నొకచో నుత్కృష్ట శాల్యోదనం,
బొక్కచో బొంత ధరించు, నొక్కొక తఱిన్ యోగ్యాంబర శ్రేణి, లె
క్కకు రానీయడు కార్యసాధకుడు దుఃఖంబున్ సుఖంబున్ మదిన్ |చ|



గ్రాసము లేక స్రుక్కిన, జరాకృశమైన, విశీర్ణమైన, సా
యాసమునైన, నష్టరుచి యైనను, బ్రాణభయార్తమైన, ని
స్త్రాసమదేభకుంభ పిశిత గ్రహ లాలస శీల సాగ్రహా
గ్రేసర భాసమానమగు కేసరి జీర్ణతృణంబు మేయునే? |ఉ|



తమ కార్యంబుఁ బరిత్యజించియుఁ బరార్థ ప్రాపకుల్ సజ్జనుల్,
తమ కార్యంబు ఘటించుచున్ బర హితార్థ వ్యాపృతుల్ మధ్యముల్,
తమకై యన్య హితార్థ ఘాతుక జనుల్ దైత్యుల్, వృధాన్యార్థ భం
గము గావించెడివార లెవ్వరొ యెఱుంగన్ శక్యమే యేరికిన్? |మ|



తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు
తవిలి మృగతృష్ణలో నీరు త్రావవచ్చు
తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు
చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు! ||



తెలివి యొకింత లేని యెడ దృప్తుడనై కరి భంగి సర్వముం
దెలిసితి నంచు గర్వితమతిన్ విహరించితిఁదొల్లి, యిప్పుడు
జ్వల మతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలినై
తెలియనివాడనై మెలంగితిం, గతమయ్యె నితాంత గర్వమున్! |చ|



వనజభవుండు కోపమున వాహనమైన మరాళ భర్తకున్
వనజవనీ విహార కలనంబుఁ దొలంగగఁ జేయుఁగాని, గుం
భవమున దుగ్ధ జీవన విభాగ విధాన నిరూఢ నైపుణీ
జనిత మహా యశో విభవ సారము హంసకు మాన్పఁ జాలునే? |చ|



విద్యచే భూషితుండయి వెలయుచున్నఁ
దొడరి వర్జింపనగుఁ జుమీ దుర్జనుండు
చారు మాణిక్య భూషిత శస్త మస్త
కంబయిన పన్నగము భయంకరము గాదె! |తే|



విద్య నిగూఢగుప్తమగు విత్తము, రూపము పురుషాళికిన్
విద్య యశస్సు, భోగకరి, విద్య గురుండు, విదేశబంధుడున్,
విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబు లేదిలన్,
విద్య నృపాలపూజితము, విద్య నెఱుంగనివాడు మర్త్యుడే? |ఉ|



క్షమ కవచంబు, క్రోధమది శత్రువు, జ్ఞాతి హుతాశనుండు, మి
త్రము దగుమందు, దుర్జనులు దారుణ పన్నగముల్, సువిద్య వి
త్త, ముచిత లజ్జ భూషణ, ముదాత్త కవిత్వము రాజ్య మీక్షమా
ప్రముఖ పదార్థముల్ గలుగు పట్టునఁ దత్కవచాదులేటికిన్? |చ|



క్షీరము మున్ను నీటి కొసగెన్ స్వగుణంబులు దన్నుఁ జేరుటన్
క్షీరము తప్తమౌటగని చిచ్చురికెన్ వెతచే జలంబు, దు
ర్వార సుహృద్విపత్తిఁ గని వహ్ని చొరంజనె దుగ్ధమంతలో
నీరముఁ గూడి శాంతమగు; నిల్చు మహాత్ముల మైత్రి యీగతిన్ |చ|
నీతి శతకం - భర్తృహరి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి