ఆపదల కోర్చి సంపద
లాపయి భోగించు ననెడి హర్షొక్తుల నీ
లోపల దలచుచు లాంతరు
దీపముచందమున వెలుఁగ దివురు కుమారీ!
భావం:-
ఓ సుకుమారీ!కష్టసుఖాలన్నారు గాని సుఖకష్టాలనలేదమ్మా!కావున మొదట
కష్టములనుభవించిన తర్వాతే సుఖము,ఐశ్వర్యము ప్రాప్తించునని తెలియుము.లాంతరు
దీపము మాదిరిగా ప్రకాశింపుము.(లాంతరు తనలోని నూనెను ఖర్చు చేస్తూలోకానికి
అంతటికి వెలుగును ప్రసాదించుటలేదా?)అట్లే నీవు గూడ మసలుకొని మహిలో
మహోన్నతురాలివై మసలుకొనుమమ్మా!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి