Astrologer

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !
అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

9, ఆగస్టు 2012, గురువారం

దేశ భక్తి గీతాలు-21-30

                                          దేశ భక్తి గీతాలు

 21.వేదంలా ఘోషించే గోదావరి

 వేదంలా ఘోషించే గోదావరి
అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రి
శతాబ్దాల చరిత వి సుందర నగరం
గత వైభవ కీర్తులతో కమ్మని గానం || వేదంలా ||

1 . రాజరాజ నరేంద్రుడు కాకతీయులు
తేజమున్న మేటి దొరలు రెడ్డిరాజులు
గజపతులు నరపతులు ఏలిన ఊరు
ఆ కథలన్నీ వినిపించే గౌతమి హోరు || వేదంలా ||

శ్లోకం:
శ్రీవాణీ గిరిజాశ్చిరాయ ధధతో వక్షోముఖాంగేషు యే
లోకానాం స్థితిమావహంత్య విహతాం స్త్రీపుంస యోగోద్భవాం |
తే వేదత్రయ మూర్తయ స్త్రిపురుషా స్సంపూజితావస్సురై:
భూయాసు: పురుషోత్తమాం భుజభవ శ్రీకంధరా శ్రేయసే ||

2. ఆది కవిత నన్నయ్య వ్రాసేనిచ్చాటా
శ్రీనాథ కవి నివాసమూ పెద్ద ముచ్చటా
కవిసార్వభౌములకిది ఆలవాలమూ | కవి |
నవ కవితలు వికసించే నందనవనమూ || వేదంలా ||

3 . దిట్టమైన శిల్పాల దేవళాలు
కట్టుకథల చిత్రాంగి కనక మేడలు
కొట్టుకొని పోయె కొన్ని కోటి లింగాలు
వీరేశలింగమొకడు మిగిలెను చాలు || వేదంలా ||

 22.భరత జనని ఘన విభవము

 భరత జనని ఘన విభవము -  భూ నభముల ప్రభవించగ (2)
శుభ మంగళ జయ ఘోషల
గళము గళము కలుపుదాం - పదము పదము కదుపుదాం  (2)
రుద్ర రౌద్ర భద్ర హస్త ఢమరుక నాదమ్ముగా
శంభు శిఖా దిగ్భందిత గంగ ఝరీ భంగముగా
దక్ష యఙ్ఞ ధ్వంస భూత భద్రుని హుంకారముగా (2)
ఫణవ నాద ధ్వంకారం దశదిశలా మ్రోగగా ||గళము||

కురు రణ నిష్కర్మణాంత  ఫల్గుణ కౄత బాణముగా
జలది లంఘనోత్సాహిత హనుమ సింహ నాదముగా
ధర్మ రక్ష దీక్ష మాన్య పాంచజన్య రావముగా (2)
విజయ శంఖ స్వర నాదము వినువీధుల నినదించగ  ||గళము||

రిపు గళ శోణిత శోభిత శివ ఖడ్గ ప్రహేళిగా
రుద్ర రాణి రణ విరచిత కరవాలపు హేలగా
వన జన సమరపు ప్రేరక రామరాజ ధనువుగా  (2)
ఆనక  తంకార ధ్వనులు లోకమంత వ్యాపించగ  ||గళము||

23.స్వామీజీ వివేకుడు కలలు గన్న భారతం

స్వామీజీ వివేకుడు కలలు గన్న భారతం
గత వైభవ శిఖరాల అంచుదాక చేర్చుదాం
ఇహపరాలతో కూడిన జీవనమే మన లక్ష్యం
ఆ లక్ష్యం చేరుదాక ఆగకుండ సాగుదాం

ఇనుపకండరాలు సంఘ శక్తినినుమడించగా
ఉక్కు నరాలే ఉద్యమ స్ఫూర్తి ప్రేరకాలుగా
విలాసాల మత్తు వదిలి వివేకుని బాటనడిచి
స్వాభిమాన భారతాన్ని జగతిలోన నిలుపుదాం

దేవుడెక్కడ ఉన్నాడని నలుదిక్కుల శోధించే
దీనదళిత దు:ఖితులను దైవంగా దర్శించే
పంథాలెన్నున్నా మన గమ్యం ఒకటేనని
ప్రపంచానికందించే సందేశం ఇదేనని

ప్రతి హిందువు సోదరుడని సగర్వంగ ప్రకటించి
అన్నార్తుల అజ్ఞానుల కష్టాలను కడతీర్చే
జగతిలోన భరతమాత అధిదేవతగా నిలపి
హిందుత్వమె వసుధ లోన మార్గదర్శి కావాలని

24. మా ప్రాణాలకు నవ ప్రాణం

 మా ప్రాణాలకు నవ ప్రాణం
మా జీవాలకు నవ జీవం
మా రాష్ట్రానికి ఉజ్వల కేంద్రం
అరుణారుణ  భగవ పతాకం అరుణారుణ  భగవ పతాకం

(1) సుర సరితా కల్లోలంలో
మహనీయ ప్రణవ ఘోషలో
మా భారత కీర్తికి ఏక ప్రతీకం ||అరుణారుణ||

(2)రామ విభుని రథ కేతనమై
రావణు చంపిన పౌరుష రూపం
నరనారాయణ సమగ్ర తేజం  ||అరుణారుణ||

(3) చంద్రగుప్త చాణుక్యాదుల
శంకరవిద్యారణ్యమౌనుల
తపహ్ పూతమగు పవిత్ర చిహ్నం  ||అరుణారుణ||

మా ప్రాణాలకు నవ ప్రాణం
మా జీవాలకు నవ జీవం
మా రాష్ట్రానికి ఉజ్వల కేంద్రం
అరుణారుణ  భగవ పతాకం అరుణారుణ  భగవ పతాకం

25. ఓ జన్మభూమి భారతి

 ఓ జన్మభూమి భారతి - ఓ పుణ్యభూమి భారతి
ఓ వందనీయ భారతి  - అభినందనీయ భారతి

జీవన కుసుమమొసంగి ఆరాధింతుము జననీ
ఎన్నెన్ని జన్మలైనా నీ పూజ చేతుమమ్మా
నిన్నే స్మరింతుమమ్మా                               || ఓ జన్మభూమి||

నీ మకుట మైన హిమగిరి జగమెల్ల మెరయు చుండ
సాగరము రతనములతో అంజలి  ఘటించుచుండ
నా మాతౄభూమి ఇదియని ఎలుగెత్తి పాడుకొనుచు
నీ సేవ చేయ జననీ మా జన్మ ధన్యమమ్మా            || ఓ జన్మభూమి||

శక హూణ  మ్లేఛ్చులంతా  ఈ భూమి నాక్రమింప
నీ స్ఫూర్తి తోడ జననీ విక్రముని వంటి వీరుల్
తమ సర్వ శక్తి తోడ జాతిని సమైఖ్య పరచి
అరితతుల చండినారు నీ వీర పుత్రులమ్మా
నీ పూజ చేతుమమ్మా                                      || ఓ జన్మభూమి||

26. శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై

శ్రీలు పొంగిన జీవగడ్డై  పాలు పారిన భాగ్యసీమై
వరలినది ఈ భరత ఖండము  భక్తి పాడర తమ్ముడా !(2)

వేద శాఖలు వెలసెనిచ్చట  ఆదికావ్యం బలరె నిచ్చట |
బాదరాయణ పరమ ఋషులకు పాదు సుమ్మిది తమ్ముడా ||శ్రీలు పొంగిన||

విపిన బంధుర వృక్ష వాటిక  ఉపనిషన్మధువొలికెనిచ్చట |
విపుల తత్వము విస్తరించిన  విమల తలమిది తమ్ముడా || శ్రీలు పొంగిన||

సూత్ర యుగముల శుద్ధ వాసన క్షాత్ర యుగముల శౌర్య చండిమ
చిత్ర దాస్యము చే చరిత్రల చెరిగిపోయెర తమ్ముడా || శ్రీలు పొంగిన

మేలి కిన్నెర మేళవించీ రాలు కరుగగ రాగమెత్తి
పాలతీయని బాలభారత పథము పాడర తమ్ముడా|| (శ్రీలు పొంగిన)||

దేశగర్వము దీప్తి చెందగ దేశచరితము తేజరిల్లగ |
దేశమరసిన ధీరపురుషుల తెలిసి పాడర తమ్ముడా || (శ్రీలు పొంగిన)||

పాండవేయుల పదునుకత్తులు మండి మెరిసిన మహితరణ కధ |
కండగల చిక్కని పదంబుల కలిపి పాడర తమ్ముడా|| (శ్రీలు పొంగిన)||

27.సంఘ శాఖకు మనము రావాలోయ్

సంఘ శాఖకు మనము రావాలోయ్ -  సంఘటన  దృశ్యమ్ము చూడాలోయ్
అన్ని రంగులు కలుపు ఆత్మ చిత్రము శాఖ -  స్నేహ సంబంధాల స్వర్గధామము రా
భిన్నతలొ   ఏకతా భవ్య రూపము చూసి  -  శీల బలములు గూర్చు సిద్ధి మార్గమురా  ||సంఘ శాఖకు||
వ్యక్తి వ్యక్తిని కలుపు ముక్తి మార్గము శాఖ - భారతీయుల సౌఖ్య భావి రూపము గా
స్వార్ధమే లేనట్టి స్వచ్ఛంద పథము రా - సహృదయ భావాల సౌందర్య సీమ రా  ||సంఘ శాఖకు||
జ్ఞాన, భక్తి, కర్మ యోగ మార్గము శాఖ - వీరవ్రతము ద్యేయనిష్ఠలబ్బును రా
సంఘానుభూతికిది  సాధనాస్థలి రా - లోక కళ్యాణమే సాధనా ఫలము రా  ||సంఘ శాఖకు||

 28.మనమంతా హిందువులం

హిందువులం ప్రియ బంధువులం సుగుణ సింధు జల బిందువులం
హిందు రాష్ట్రమును పూజిద్దాం హైందవ జాతిని సేవిద్దాం
విశ్వ శాంతికై హిందు సంఘటన సోపానమ్మని చూపిద్దాం

హిందుత్వమే మన ఊపిరి హైందవమే మన సిరుల ఝరి
హిందువుగానే జీవిద్దాం హిందువుగానే మరణిద్దాం
మరల మరల ఇల జననమందుచో హిందువుగానే జన్మిద్దాం

హిందువుగా మది గర్వించు స్వాభిమానమును ఎద పెంచు
బందా రాణా గురు గోవిందుల బలిదానాలను తలపించు
ఎవరేమన్నా ఎదురేదైనా నే హిందువునని నినదించు

 చేయ్ చేయ్ కలుపుదాం సేవ చేయ కదులుదాం
ప్రజల కొరకు సంఘముగా ప్రతినిమిషం బ్రతుకుదాం

29.చేయ్ చేయ్ కలుపుదాం

చరణం1: అవయవాలు వేరైనా ఆత్మ మాత్రం ఒక్కటే
ప్రాంతం పెరేధైన ప్రజలంతా ఒక్కటే
భాషలేన్ని పలికిన భావ సంపదోక్కటే
ప్రమాదాలు ఎదురైతే ప్రతిస్పందన ఒక్కటే ||చేయ్ ||


చరణం2:కంటినలుసు కాలి ముళ్ళు కలిగిఒచే బాధలను
గుండె రగుల మెదడు కాదుల కరముల తొలగించుదాం
భారత భూమిని సీమను భాదలు పెల్లు బికినా
మన కండలు కరిగించి యిడుములు తొలగించుదాం ||చేయ్ ||

చరణం 3: జన శక్తిని జాతి కొరకు జాగ్రుత మొనరించుదాం
ఒకే తల్లి బిడ్డలమను ఊహనిచట పెంచుదాం
వందేమాతరం అంటూ ముందు ముందు కేడుదాం
ఒకకోకరి తోడూ నిలిచి ఉన్నతి సదించుదాం ||చేయ్ ||

 30.ఆంధ్ర సముద్ర మీయమ్మ పాదాలపై

కానిపింపదే నేడు కాకతీయ ప్రాజ్య
సామ్రాజ్య జాతీయ జయపతక:
వినిపింపరే నేడు విద్యానగర రాజ
సభలోని విజయ దుందుభుక మ్రోత:

వెలగదే నేడు బొబ్బిలి కోట బురుజుపై
తాండ్ర పాపయ తళత్తళల బాకు;
నిప్పచ్చరంబయ్యెనే నేడు వీర ప
ల్నాటి యోధుల సింహనాధలక్ష్మీ;

చెక్కు చెదరని, యేనాడు మొక్కవోని,
అంధ్ర పౌరుషమిప్పు డద్వాన్నమయె;
మరలనొక మాటు వెనుకకు మరలి, చూచి
దిద్దుకోవమ్మ బిడ్డల, తెలుగు తల్లి!

కవులకు బంగారు క్డియాలు తొడిగిన
రాయల గన్న వరాల కడుపు
సీసాలతో కవితాసార మిచ్చు శ్రీ
నాధుని గన్న రత్నాల కడుపు

భద్రాద్రిలో రామభద్రు స్థాపించు గో
పన్నకు గన్న పుర్వాంపు కడుపు
జగమగంటిమి నల్డెసల్ వెలార్చిన పాప
రాయని గన్న వజ్రాల కడుపు

పిసినిగొట్టు రాజులకును, పిలక జుట్టు
కుకవులకు, పిచ్చి పిచ్చి భక్తులకు, పిరికి
వందలకు తావు గాకుండ ముందు ముందు
దిద్దుకోవమ్మ బిడ్డల, తెలుగుతల్లి!

అభ్రంకషంబ్ హిమాలయం బే తల్లి
మౌళి జుట్టిన మల్లెపూల చెండు
గోదావరి కృష్ణ లేవేవి కటిసీమ
వ్రేలాడు ఆణిముత్యాల నదులు

ఆంధ్ర సముద్రమీ యమ్మ పాదాలపై
జీరాడు పట్టుకుంచ్చెల చెరంగు
ఎనుబది కోట్లు దాటిన భారతీయు లే
కళ్యాణి చల్లని కడుపు పంట

ఆమె బ్రహ్మర్షి జాతి కళ్యాణ గీతి
ధర్మాసముసేత వీరమాత ప్రవూతి
విశ్వవిఖ్యాత సిశ్రీల వెలముగాతి
పరమ కరుణ సమేత మా భరతమాత

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి